సూపర్: భారత్,చైనా ఆర్మీలు హ్యాండ్ ఇన్ హ్యాండ్
న్యూఢిల్లీ: భారత్, చైనా దేశాలు ఉమ్మడిగా ఆర్మీ కార్యకలాపాలు చేపడుతూ సంబంధాలను మరింత బలపరుచుకుంటున్నాయి. న్యూక్లియర్ సఫ్లైర్స్, మసూద్ అజహర్ ను అమెరికా టెర్రరిస్టుగా ప్రకటించాలని రెండు దేశాల సమస్యలను పక్కన పెట్టాయి.
దౌత్యపరమైన సంబంధాల దిశగా ఇరు దేశాలు ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా గత ఫిబ్రవరిలో తొలి అడుగు వేసి మొదటి సారి ఆర్మీ కార్యకలాపాలు చేపట్టాయి. దానికి సీక్వెల్ గా బుధవారం జమ్మూ కాశ్మీర్ లోని తూర్పు లఢక్ లో ఉమ్మడి ఆర్మీ సేవలందించాయి.

భారత్ సరిహద్దు గ్రామంలో సంభవించిన భూకంప బాధితులకు వెంటనే ఉమ్మడి ఆర్మీ సేవలు అందించడం వంటి కార్యక్రమంలో రోజంతా పాల్గొన్నాయి. మొదటి సారి చైనీస్ వైపు జరగగా రెండవ సారి భారత్ సరిహద్దు వైపు జరిగాయని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.
హ్యాండ్ ఇన్ హ్యాండ్ సిరీస్ లో భాగంగా భారత్-చైనా జాయింట్ ఆర్మీ కార్యకలాపాలు చేపడుతూ సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడటానికి దోహదం చేస్తుందని ఆర్మీ సంతోషయం వ్యక్తం చేసింది.
ఈ ఏడాది హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎడిషన్ మహారాష్ట్రలోని పుణేకు సమీపంలోని ఔంద్ లో నవంబర్ 15 నుంచి 27 వరకు జరుగుతాయని భారత్ ఆర్మీ వెల్లడించింది. భారత్ ఆర్మీతో కలిసి చైనా ఆర్మీ పని చేస్తున్న విషయం తెలుసుకున్న పాక్ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది.












Click it and Unblock the Notifications