భారత్‌లో మే 3-5 తేదీల్లో పీక్స్‌కి కరోనా... సైంటిస్టుల బృందం అంచనా... కీలక సూచనలు...
భారత్‌లో కరోనా కేసులు మే నెలలో 3-5 తేదీల మధ్య పీక్స్‌కి చేరే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. నిజానికి మే 5-10 తేదీల్లో కేసులు పీక్స్‌కి చేరవచ్చునని అంతకుముందు సైంటిస్టుల బృందం అంచనా వేసింది. తాజాగా అది మరింత ముందుకు జరగడం గమనార్హం. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సలహాలు,సూచనలు ఇస్తున్న సైంటిస్టుల బృందం తాజాగా ఈ వివరాలు వెల్లడించింది.
'మా అంచనా ప్రకారం... దేశవ్యాప్తంగా వచ్చే వారం నాటికి కరోనా కేసుల సంఖ్య పీక్స్‌కి చేరుతుంది.' అని కేంద్ర ప్రభుత్వం నియమించిన సైంటిస్టుల బృందానికి నేత్రుత్వం వహిస్తున్న సైంటిస్ట్ విద్యాసాగర్ తెలిపారు. కేంద్రం దీర్ఘకాలిక పరిష్కారాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయవద్దన్నారు. రానున్న నాలుగు లేదా ఆరు వారాల్లో కరోనాను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఫోకస్ చేయాలన్నారు.

భారత్‌లో కరోనా మొదటి వేవ్ సెప్టెంబర్ మధ్య నాటికి పీక్స్‌కి చేరి ఒక్కరోజులోనే 97,894 కొత్త కేసులు నమోదయ్యాయని విద్యాసాగర్ గుర్తుచేశారు. ఇప్పుడు అంతకు మూడింతల కేసులు నమోదవుతున్నాయన్నారు. అధికారికంగా నమోదవుతున్న కేసుల కంటే అసలు కేసులు 50 రెట్లు ఎక్కువగా ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. చాలామందిలో లక్షణాలు లేకపోయినా కరోనా బారినపడుతున్నారని చెప్పారు.
శుక్రవారం(ఏప్రిల్ 30) దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,86,452 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.87కోట్లకు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనాతో 3498 మంది మరణించారు. ఇప్పటివరకూ ఒక్కరోజు వ్యవధిలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల మరణాల సంఖ్య 2.08లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 31.70 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Recommended Video
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం... భారత్‌లో సగటున ఒక నిమిషానికి 270 కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంటే సగటున ఒక సెనుకు నాలుగు కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాల విషయానికి వస్తే... సగటున ఒక నిమిషానికి ఇద్దరు కరోనాతో మరణిస్తున్నారు.












Click it and Unblock the Notifications