వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయ తాండవం : 142 దేశాల్లో డెల్టా కేసులు, డేంజర్ లిస్ట్ లో భారత్ : డబ్ల్యూహెచ్ఓ

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి కంట్రోల్లోకి వచ్చిందా? ప్రభుత్వం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా కరోనా నిబంధనల విషయంలో ప్రజల్లో కరోనా భయం లేదా? అత్యధికంగా డెల్టా వేరియంట్ వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో భారతదేశం డేంజర్ జోన్ లో ఉందా ? మరోపక్క కరోనా థర్డ్ వేవ్ భారతదేశానికి పెను ప్రమాదంగా మారనుంది అని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్వో హెచ్చరిక ప్రమాదపు అంచున భారత్ వున్నట్టు వెల్లడిస్తోందా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

వణికిస్తున్న మార్ బర్గ్ వైరస్ : ఆ కేసుకు 150 కాంటాక్ట్స్ , ఎబోలా జాతి డెడ్లీ వైరస్ : డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్వణికిస్తున్న మార్ బర్గ్ వైరస్ : ఆ కేసుకు 150 కాంటాక్ట్స్ , ఎబోలా జాతి డెడ్లీ వైరస్ : డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్

భారత్ లో కొనసాగుతున్న కరోనా కేసుల కల్లోలం

భారత్ లో కొనసాగుతున్న కరోనా కేసుల కల్లోలం


భారతదేశంలో కరోనా కేసులు విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో కరోనా కేసులలో భారీగా హెచ్చుతగ్గులతో కూడా 40 వేల వరకూ కరోనా కేసులు నిత్యం నమోదవుతున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభణ సాగిస్తోంది.భారత దేశంలో ప్రస్తుతం రోజువారి కేసులలో అత్యధిక కేసులను కేరళ రాష్ట్రం నమోదు చేస్తుంది. కేరళ రాష్ట్రంలో వాక్సినేషన్ తీసుకున్న వారికి సైతం కరోనా మహమ్మారి సోకుతున్న తీరు దేశానికి ఆందోళనకరంగా మారింది.

దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు

దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు

ఇక దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో, మహారాష్ట్రలోనూ కరోనా పంజా విసురుతూనే ఉంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే అమెరికా, భారత్, ఇరాన్, బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లో కరోనా దారుణ పరిస్థితులకు కారణంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. గత వారం ఈ దేశాలలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

 డేంజర్ లిస్టు లో భారత్ .. డెల్టా వేరియంట్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

డేంజర్ లిస్టు లో భారత్ .. డెల్టా వేరియంట్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ పై భయం నెలకొన్న సమయంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అనేకమార్లు ఆధిపత్య వేరియంట్ గా డెల్టా వేరియంట్ ఉద్భవిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ వేరియంట్ విజృంభణ పై మరోమారు ప్రకటన చేసిన డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుతం వివిధ దేశాలలో కేసులు పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని వెల్లడించింది. భారత్, ఇండోనేషియా దేశాలలో కాస్త ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తున్నప్పటికీ, డెల్టా వేరియంట్ ఆందోళన కొనసాగుతుంది. ఇక అమెరికాలో మరోమారు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొత్త కేసులలో 35 శాతం పెరుగుదల నమోదైందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది.గత వారం రోజుల్లో ఏడు కొత్త దేశాల్లోకి కరోనా డెల్టా వేరియంట్ అడుగు పెట్టిందని వెల్లడించింది.

Recommended Video

Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu
 డెల్టా కేసులు నమోదవుతున్న దేశాలు 142

డెల్టా కేసులు నమోదవుతున్న దేశాలు 142

ఇప్పుడు డెల్టా కాటుకు గురైన దేశాల సంఖ్య 142 చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆల్ఫా, గామా,బీటా వైరస్ లతో పోలిస్తే డెల్టా వెయ్యి రెట్లు అధికంగా ప్రభావం చూపిస్తోందని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది. భారతదేశం అలర్ట్ గా ఉండాల్సిన సమయం అని పదే పదే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తుచేస్తుంది. ఇప్పటికే భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ విషయంలో ప్రారంభదశలో ఉన్నామని పదేపదే హెచ్చరికలు జారీ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన కొనసాగించాలని అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అసమానతలు లేకుండా తగిన విధంగా అన్ని దేశాలకు సమానంగా అందేలా చూడాలని కూడా పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అసమానతలు తలెత్తినా కరోనా కట్టడి సాధ్యంకాదని ప్రపంచ దేశాలకు పదే పదే సూచనలు చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

English summary
The World Health Organization (WHO) has recently revealed that the corona in the United States, India, Iran, Brazil and Indonesia is changing due to worsening conditions. Last week the World Health Organization reported the highest number of corona cases in these countries. India is on the danger list. The World Health Organization says the number of countries now affected by the Delta has reached 142. It was revealed last week that the Corona Delta variant has stepped into seven new countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X