పాక్ నెత్తిన అగ్ని వర్షం కురిపించిందిలా..: హెచ్‌డీ వీడియోలు విడుదల చేసిన భారత ఆర్మీ

India Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై మిస్సైళ్లతో దాడి చేసింది.

తెల్లవారు జామున 2 గంటల సమయంలో తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాద క్యాంపులు ధ్వంసం అయ్యాయి. పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తోన్నాయి.

India releases videos of missile strikes on Pakistani terror camps

దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ భూభాగంపై ఉంటూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోన్న ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ వైమానిక దాడులను చేపట్టింది. ఉగ్రవాదాన్ని ఉద్దేశపూరకంగా పెంచి పోషిస్తూ వచ్చిన పాకిస్తాన్ పీచమణచాలనేదే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం.

తాజా దాడులు కూడా ఉగ్రవాద శిబిరాలను టార్గెట్‌గా చేసుకునే సాగాయి. ఈ మిస్సైళ్ల దాడిలో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ భూభాగంపై ఉండే ఉగ్రవాద శిబిరాలే తమ లక్ష్యమని పేర్కొన్నాయి.

తాజా దాడుల్లో జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం సంభవించింది. బహవాల్‌పూర్‌ అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో సుభాన్ మసీద్ ప్రాంతంలో చాలాకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న జైషె మహ్మద్ సంస్థకు చెందిన నాలుగు ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి.

ముజఫ్ఫరాబాద్‌లో బిలాల్ మసీద్ ప్రాంతంలో మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన మూడు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ధ్వంసమైనట్లు ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. దీనితో పాటు సియాల్‌కోట్‌లో మురిడ్కె, కోట్కి, షక్కర్‌ఘర్‌‌లల్లో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన రెండు క్యాంపులు చెల్లాచెదురు అయ్యాయని పేర్కొన్నాయి.

India releases videos of missile strikes on Pakistani terror camps

బహవల్‌పూర్, కొట్లి, మర్కజ్ సుభాన్ అల్లా, మర్కజ్ తైబా, సర్జల్, టెహ్రా కలాన్, మురిడ్కె, మెహమూనా జోయా, సియాల్‌కోట్, సయ్యద్నా బిలాల్ క్యాంప్‌లో గల జైషె మహ్మద్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. మర్కాజ్ అహ్లె హదిల్, బర్నాలా, మర్కజ్ అబ్బాస్, సవాయ్ నల్లా క్యాంప్, ముజఫరాబాద్‌లల్లో లష్కరే తొయిబా, మస్కర్ రాహీల్ షాహిద్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద క్యాంపులు నేలమట్టం అయ్యాయి.

దీనికి సంబంధించిన వీడియోలను భారత ఆర్మీ విడుదల చేసింది. సవాయ్ నల్లా, సర్జల్, మురిడ్కె, కొట్లి, కొట్లి గుల్‌పూర్, మెహమూనా జోయా, భీంబర్, బహవాల్‌పూర్‌పై సాగించిన వైమానిక దాడులు, ఫైటర్ జెట్స్ నుంచి జార విడిచిన మిస్సైళ్లు, అవి సృష్టించిన విధ్వంసకర పరిస్థితులు ఇందులో రికార్డయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+