ఇకపై ఆ వస్తువులపై జీరో టారిఫ్: పీయూష్ గోయల్ కీలక ప్రకటన

భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తూ అమెరికాతో కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం గురించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ శనివారం(ఫిబ్రవరి 7) కీలక వివరాలను వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంపై సంతకం చేయడంతో భారతీయ ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా భారతీయ ఎగుమతిదారులకు, రైతులకు, చిన్నతరహా పరిశ్రమలకు ఈ ఒప్పందం ఓ గొప్పవరంగా మారనుంది.

జీరో సుంకం వర్తించే ఉత్పత్తులు
ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పలు వస్తువులపై దిగుమతి సుంకాలు పూర్తిగా తొలగించడం వల్ల మన దేశ వస్తువులకు అమెరికాలో ధర తగ్గి.. గిరాకీ పెరుగుతుంది. టీ, కాఫీ, మసాలా దినుసులు, కొబ్బరి నూనె, కొబ్బరి ఉత్పత్తులు, వెజిటబుల్ వాక్స్ వంటి ఉత్పత్తులపై ఇకపై ఎటువంటి పన్ను ఉండదు. మామిడి, అరటి, జామ, అవకాడో, అనానస్, పపాయా వంటి పండ్లు, తృణధాన్యాలు, బేకింగ్ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో 'జీరో టారిఫ్' ప్రవేశం లభించింది. దాదాపు 13 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ మందుల ఎగుమతులపై సున్నా సుంకం వర్తిస్తుంది. ఇది మన ఫార్మా కంపెనీలకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. వజ్రాలు, రత్నాలు, ఆభరణాలు, ప్లాటినం, గడియారాల ఎగుమతిపై సుంకాలు ఎత్తివేయడం వల్ల ఈ రంగంలోని కార్మికులకు చేతినిండా పని లభిస్తుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే స్మార్ట్‌ఫోన్లపై కూడా భవిష్యత్తులో సున్నా సుంకం వర్తించేలా ఒప్పందం కుదిరింది.

India US Trade Deal Zero Tariffs on Tea Spices and Pharma Minister Piyush Goyal Shares Key Benefits

రైతుల ప్రయోజనాలే పరమావధి
ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో భారత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మన దేశ రైతులు పండించే ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో సులభంగా ప్రవేశం కల్పిస్తూనే, విదేశీ ఉత్పత్తుల పోటీ నుంచి మన రైతులను కాపాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాల ఉత్పత్తులు, గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, చక్కెర వంటి రంగాలను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. అంటే అమెరికా నుంచి ఈ వస్తువులు తక్కువ ధరకు భారత్‌కు వచ్చి మన రైతులకు నష్టం కలిగించకుండా ప్రభుత్వం రక్షణ కల్పించింది. ఎగుమతులు పెరగడం వల్ల భారతీయ రైతులకు గిట్టుబాటు ధర లభించి, వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

అమెరికాకు లభించే ప్రయోజనాలు
వాణిజ్యం అనేది ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉండాలి కాబట్టి భారత్ కూడా అమెరికాకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అమెరికా నుంచి భారత్‌కు వచ్చే వైన్, మద్యం, కాస్మెటిక్స్, వైద్య పరికరాలు, పారిశ్రామిక యంత్రాలపై దిగుమతి సుంకాలను తగ్గించనున్నారు. అయితే, ఇక్కడ కూడా మన దేశీయ పరిశ్రమలు దెబ్బతినకుండా 'కనీస దిగుమతి ధర'నిబంధనలను ప్రభుత్వం అమలు చేయనుంది.

ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో అడుగు
ఈ ఒప్పందం భారత్‌ను ఆత్మనిర్భర్ దిశగా తీసుకెళ్తుందని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎగుమతులు పెరగడమే కాకుండా, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ డీల్ వల్ల అమెరికాలో చైనా వస్తువుల కంటే భారత వస్తువులకే ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+