చెప్పి మరీ, ఆనవాళ్లు గల్లంతు - మసూద్ అజార్ సహా టెర్రర్ చీఫ్స్ హతం..!?
భారత్ సైన్యం మెరుపు దాడిలో ఉగ్రవాద శిబిరాలు నేల మట్టం అయ్యాయి. పాక్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత్ ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ సైన్యం క్షిపణులు ప్రయోగించింది. ఒక్క సారిగా జరిగిన దాడుల్లో ఉగ్రవాదుల క్యాంపుల్లో శిక్షణ పొందుతున్న వారు మరణించారు. జైషే ఈ మహ్మద్, లష్కర్ తోయిబా అగ్రనేతలు సైత్ం హతం అయినట్లు తెలుస్తోంది.
భారత్ సైన్యం అర్ద్రరాత్రి ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పాక్ తో సహా పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. బహావల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. బహవల్‌పూర్‌లోని మసూద్ అజార్ ప్రధాన కార్యాలయాన్ని భారత్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. వీరి ప్రధాన కార్యాలయం, మదర్సా ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా ధృవీకరించింది. ఈ దాడిలో 50 మంది జైషే ఉగ్రవాదులు హతమయినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో మురిడ్కేలోని లష్కరే రహస్య స్థావరాన్ని భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కరే, జైషే సంస్థలకు చెందిన చాలా మంది అగ్ర కమాండర్లు హతమయ్యారు. అయితే, ఈ దాడిలో మసూద్ అజార్, హఫీజ్ సయీద్ మరణం పైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక, ఈ మెరుపు దాడుల తరువాత పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
పాకిస్తాన్ ప్రధాని ఈ దాడిని ధృవీకరించారు. భారతదేశం యుద్ధానికి కాలు దువ్విందని ఆయన అన్నారు. ప్రతీకారం తీర్చుకునే హక్కు మనకు ఉందంటూ, దీటుగా బదులిస్తామని ప్రకటించారు. అర్ద్రరాత్రి భారత్ సైన్యం ముజఫరాబాద్‌లో 2 దాడులు చేసింది. బహవల్పూర్‌లో మూడవ దాడి చేసింది. కోట్లిలో, చక్ అమ్రు, గుల్పూర్, భింబర్, మురిడ్కే, సియాల్‌కోట్‌లో దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. కాసేపట్లో దాడులు.. ఫలితాల పైన ఇండియన్ ఆర్మీ స్పష్టత ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications