సిడ్నీలో బెంగళూరు టెక్కీ హత్య: ముందే హెచ్చరించిన రూమ్మెట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హత్యకు గురైన బెంగళూరు మహిళా ఐటీ కన్సల్టెంట్‌కు ఆమె రూమ్ మేట్ ముందే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. సిడ్నీ శివారులోని వెస్ట్ మీడ్ పారామట్టా పార్కులో శనివారం రాత్రి తొమ్మిన్నర గంటల ప్రాంతంలో బెంగళూరుకు చెందిన ప్రభా అరుణ్ కుమార్(40)ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచారు. పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందారు.
దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసు విచారణలో ప్రభా రూమ్మేట్.. తాను ముందే హెచ్చరించినట్లుగా తెలిపారు. ప్రభ రూంమేట్ పేరు శారద. ఆ రోడ్డులో (ప్రభ హత్యకు గురైన రోడ్డులో) ఒంటరిగా ఎప్పుడూ రావొద్దని తాను ముందే హెచ్చరించానని విచారణలో చెప్పారు.

చీకటి సమయంలో ఆ రోడ్డు వెంట రావొద్దని చెప్పానన్నారు. ఆమె వర్క్ ఆలస్యం అవుతుందని, దీంతో నిత్యం లిఫ్ట్ అడగటడం మంచిది కాదని భావించేదని చెప్పారు. ఆ రోడ్డులో ఒంటరిగా వస్తే.. ఎవరైనా ఆపి డబ్బులు అడుగుతారని తాను ముందే హెచ్చరించానని చెప్పారు.
ప్రభ నిత్యం తన భర్త, కూతురుతో ఫోన్లో మాట్లాడుతుందని చెప్పారు. వర్క్ పూర్తి కాగానే తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడుతుందని చెప్పారు. మరోవైపు, ఆస్ట్రేలియా పోలీసులు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు. కాగా, ప్రభ భర్త తన తొమ్మిదేళ్ల కూతురుతో కలిసి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ప్రభ మృతదేహాన్ని గుర్తించనున్నారు. కాగా, ఆమె తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూ.. అతను నన్ను కత్తితో పొడిచాడు.. డార్లింగ్ అని చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications