ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య: కీలక ఆధారం లభ్యం!
చెన్నై: చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో జరిగిన టెక్కీ స్వాతి హత్య కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన అనుమానితుడే హంతకుడని, అతడు హత్య తర్వాత ప్లాట్ ఫాం నుంచి ట్రాక్ పైకి దూకి వేగంగా వెళ్లే వీడియో ఆధారం లభించిందని పోలీసులు తెలిపారు.
స్వాతి హత్య పైన పోలీసులు ముమ్మర దర్యాఫ్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ నివాసం బయట ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో అనుమానితుణ్ని గుర్తించారు. తాజాగా, దర్యాప్తులో మరో అడుగు ముందుకు వేశారు.

ట్రావెల్ బ్యాగు తగిలించుకుని వెళ్తున్న అదే అనుమానితుడు నుంగంబాక్కం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై నుంచి ట్రాక్ పైకి దూకి వేగంగా వెళ్తున్న మరో వీడియో దృశ్యాన్ని పోలీసులు సంపాదించారు. ట్రాక్‌పై నుంచి వేగంగా నడిచివెళ్లి రైల్వేస్టేషన్ బయటివైపు ఉన్న సౌరాష్ట్రనగర్ 7వ వీధివైపు వెళ్తున్నట్లు గుర్తించారు.
మొదట గుర్తించిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను సౌరాష్ట్రనగర్ 7వ వీధిలోని ఓ నివాసం నుంచి పొందింది కావడంతో అతడే హంతకుడని పోలీసులు చెబుతున్నారు. ఫుటేజ్‌లోని వ్యక్తిని గుర్తించిన వెంటనే ఈ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చినట్లేనని భావిస్తున్నారు.
ఇన్ఫోసిస్ టెక్కీ హత్య, రెండో వీడియో రిలీజ్, కష్టమే!: తండ్రి విజ్ఞప్తి
అనుమానితుడు ఎటు వెళ్లి ఉండొచ్చనే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు లభించిన పరిసరాల్లో ఇంకా ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా? వాటిలో నిందితుడి ఆనవాళ్లు నిక్షిప్తమయ్యాయా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
నిందితుడి కోసం మూడు పోలీస్ టీంలు
స్వాతి హంతకుడిని గుర్తించేందుకు మూడు పోలీస్ టీంలు ఫాం అయ్యాయి. కాగా, రైల్వే ఎస్పీ ఆనయ్ విజయ సోమవారం నాడు స్వాతి ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications