ప్రత్యేకం: ప్రోగ్రాముల ప్రకటన వేదిక - యాడ్‌జీబ్రా
బెంగుళూరు: డిజిటల్ మీడియా టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఇనుక్సు కంపెనీ మార్కెట్లోకి కొత్తగా 'యాడ్‌జీబ్రా'ను ప్రవేపెడుతుంది. యాడ్‌జీబ్రా అంటే ప్రోగ్రాముల ప్రకటనలకు వేదికగా ఉంటుంది. యాడ్‌జీబ్రా ఒక సమగ్ర, పారదర్శక, మోసం లేని వాతావరణంలో ప్రకటనకర్తలు మరియు ప్రచురణకర్తలు ఇద్దరికీ వారధిగా పనిచేస్తుంది.
వెబ్ మీడియాలో ఖచ్చితమైన, నమ్మకమైన ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రకటనకర్తలు వారి బ్రాండ్‌ను ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా స్లైడర్, ఇమేజి, వీడియో లాంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు.

మార్కెటర్ల స్వీయ సర్వే మోడల్ కోసం నిపుణులు ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహిస్తారో తెలియజేయవచ్చు. పెరుగుతున్న ఆదాయం కోసం ప్రకటన జాబితాతో పాటుగా ప్రేక్షకులను వాణిజ్యానికి ప్రచురణకర్తలు ప్రోత్సహించేదే యాజ్‌జీబ్రా. యాడ్‌జీబ్రా సాయంతో పబ్లిషర్స్ నిజ సమయ ధర, ఫ్రీక్వెన్సీతో పాటు పూర్తి నియంత్రణను పొందొచ్చు.
యాడ్‌జీబ్రా గురించి కంపెనీ సీఈఓ రోహిత్ భాగద్ మాట్లాడుతూ డిజిటల్ మీడియా రంగంలో స్థిరంగా ప్రకటనల ప్రోగ్రాముల వేదిక యొక్క పూర్తి సామర్థ్యాన్ని అన్వేషించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇనుక్సు ప్రధాన కార్యాలయం పూణెలో ఉంది.

భారతదేశపు నెం. 1 డిజిటల్ మీడియా కంపెనీ నెట్ కోర్ సోల్యూషన్స్, భారతదేశపు నెం.1 ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ వన్‌ఇండియాల వెంచరే ఈ ఇనుక్సు యాడ్‌జీబ్రా. డిజిటల్ మీడియా రంగంలో 65 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన నిపుణులు జట్టు దీని సొంతం.
స్ధాపించిన రెండు సంవత్సరాల కాలంలో డిజిటల్ ప్రకటనలు, ఉత్పత్తులకు సంబంధించిన 100కుపైగా ఖాతాదారులకు సొంతం చేసుకోవడం గర్వించతగ్గ విషయం. ఇనుక్సుని చాలా త్వరితగతిన MENA, APAC ప్రాంతాల్లో విస్తరించే యోచనలో కంపెనీ ఉంది.












Click it and Unblock the Notifications