ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హ్యాక్: కోటి మంది డేటా చోరీ
ముంబై: భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్‌సైట్ గురువారం హ్యాక్ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వెబ్‌సైట్‌లోని సుమారు కోటి మందికి చెందిన వ్యక్తిగత సమాచారం దొంగతనానికి గురైనట్లు తెలుస్తోంది.
పాన్ కార్డు నెంబర్లు, వ్యక్తిగత సమాచారం, సెక్యూరిటీ ప్రశ్నలు వంటి డేటాను సైబర్ నేరగాళ్ళు సేకరించినట్లు మహారాష్ట్ర పోలీస్ శాఖ గుర్తించింది. కాగా, తమ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కి గురయిందంటూ వచ్చిన వార్తలను రైల్వే అధికారులు ఖండించారు.
తమ వెబ్ సైట్ హ్యాక్ కాలేదని, ఎలాంటి డేటా చోరీ కాలేదని రైల్వే బోర్డు సభ్యుడు మహ్మద్ జంషెడ్ తెలిపారు. రైల్వేశాఖ వెబ్‌సైట్ యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్ నుంచి ప్రయాణికుల డేటాను హ్యాకర్లు చోరీ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ సెల్ పేర్కొన్న నేపథ్యంలో ఆ వార్తలు నిజం కాదని అన్నారు.

దీనిపై విచారణ చేపట్టామని వెల్లడించింది. వెబ్‌సైట్ సెక్యూరిటీపై రెండుసార్లు సమీక్షించినట్లు ఆయన వివరించారు. సాంకేతిక బృందం పూర్తిగా పరిశీలించిందని, ఐఆర్‌సీటీసీ ఈ టికెటింగ్ వెబ్‌సైట్ అంతా క్షేమంగానే ఉందని ఆయన వివరించారు. యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్స్ లీక్ కాలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వైబ్‌సైట్ హ్యాక్, డేటా చోరీపై మహారాష్ట్ర పోలీస్ సైబర్ విభాగం దర్యాప్తు చేస్తోంది. దేశంలోని అతి పెద్ద పర్యాటక, ఈ కామర్స్ వెబ్‌సైట్ అయిన ఐఆర్‌సీటీసీలో కొన్ని కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ వెబ్‌సైట్‌ను నిత్యం కొన్ని లక్షల మంది వినియోగిస్తుంటారు.
@rahulkanwal IRCTC website has not been hacked. Enquiry is being conducted regarding alleged data theft.
— IRCTC Ltd. (@IRCTC_Ltd) May 5, 2016












Click it and Unblock the Notifications