తక్కువ ధరలో కాశీ, అయోధ్య, పూరీ irctc ప్యాకేజ్
వేసవి సెలవుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పుణ్యక్షేత్రంకానీ, విహారానికి కానీ వెళ్లిరావాలనుకుంటారు. ఎక్కడికైనా తమను కూడా తీసుకువెళ్లండంటూ పిల్లలు ఒకటే గొడవ చేస్తుంటారు. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం తాజాగా అదిరిపోయే టూర్ ప్యాకేజ్ తీసుకువచ్చింది. దీనిద్వారా అందుబాటు ధరలోనే మూడు పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. కాశీ, అయోధ్య, పూరి వంటి ప్రాంతాలకు వెళ్లిరావొచ్చు. ఈ టూర్ ఎక్కడి నుంచి ఉంటుంది? ధర ఎంత? ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎన్నిరోజులు? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ను అందుబాటులో ఉంచింది. మే 27 నుంచి ప్రారంభమై జూన్ 4వ తేదీన ముగిసే 9 రోజుల టూర్ మూడు కేటగిరిల రూపంలో ఉంటుంది. కంఫర్ట్, స్టాండర్డ్, ఎకానమీ కేటగిరి ప్రకారం ఛార్జీలుంటాయి. వీటిలో మనకు అందుబాటులో ఉంది ఎంపిక చేసుకోవచ్చు. ఎకానమీ కింద డబుల్/ ట్రిపుల్ షేర్ ధర రూ. 15,120గా నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల్లోపు చిన్నారులకు రూ. 14,115 నుంచి ప్రారంభమవుతుంది.

స్టాండర్డ్ కేటగిరిలో డబుల్/ ట్రిపుల్ షేర్ ధర రూ. 23,995గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల్లోపు చిన్నారులకు రూ. 23,815గా ఉంది. కంఫర్ట్ కేటగిరిలో ధర రూ. 31,435 నుంచి ప్రారంభమవుతోంది. డబుల్/ ట్రిపుల్ షేర్‌కు ఇది వర్తిస్తుంది. 5 నుంచి 11 సంవత్సరాల్లోపు చిన్నారులకు ధర రూ. 30,015గా ఫిక్స్ చేశారు. ఇందులో మనకు అందుబాటులో ఉండేది, నచ్చిన కేటగిరిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఎకానమి అంటే స్లీపర్ క్లాస్‌లో జర్నీ ఉంటుంది. స్టాండర్డ్ అంటే థర్డ్ ఏసీ టికెట్, కంఫర్ట్ అంటే సెకండ్ ఏసీ టికెట్ తో ప్రయాణించవచ్చు. ఉదయం టీ, టిఫెన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది.
పూరీ జగన్నాథుడు, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, విష్ణు గయ, కాశీ విశ్వనాథ్, గంగా హారతి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి ప్రాంతాలను, ఆ ప్రాంతాల్లోని దేవాలయాలను సందర్శించవచ్చు. విజయనగరం, పెందుర్తి, సమల్ కోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్ నుంచి టూర్ కు వెళ్లొచ్చు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications