భారత్‌లో అడుగుపెట్టిన ఐసీస్?
ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భారత్‌ను టార్గెట్ చేసిందా? భారత్ లక్ష్యంగా ఉగ్ర కార్యకలాపాలను విస్తరిస్తోందా? తాజాగా ఐసీస్ చేసిన ప్రకటన ఇదే అనుమానాలు కలిగిస్తోంది. ఇండియాలో ఓ ప్రావిన్స్‌ను ఏర్పాటు చేశామన్న ఉగ్ర సంస్థ ప్రకటన ఆందోళనకు దారితీస్తోంది. అయితే భారత్‌లో ఐఎస్ఐఎస్ స్థావరం ఏర్పాటు చేసే అవకాశమే లేదని నిఘా సంస్థలు స్పష్టం చేశాయి.

కాశ్మీర్ కేంద్రంగా స్థావరం
దేశంలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఐసీస్ ఉగ్రవాదులు భారత్‌లో అడుగుపెట్టారన్న వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం జమ్మూకాశ్మీర్ కేంద్రంగా ఓ ప్రావిన్స్‌ను ఏర్పాటు చేసినట్లు ముష్కర మూక ప్రకటించింది. విలయ ఆఫ్ హింద్ పేరుతో ఈ స్థావరాన్ని ఏర్పాటు చేసినట్లు ఉగ్రసంస్థ వెల్లడించింది. కాశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన అనంతరం ఈ ప్రకటన చేసింది. మే 10న సోఫియాన్ జిల్లాలోని అమ్షిపొరాలో జరిగిన దాడి వెనుక తమ హస్తం ఉందని ఐసీస్‌కు ప్రకటించుకుంది.

ఐసీస్ జాడ లేదు
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేసిన ప్రకటనను జమ్ము కాశ్మీర్ పోలీసులు ఖండించారు. లోయలో ఐసీస్ జాడ లేదని చెప్పారు. మరోవైపు
ఉగ్ర కదలికల్ని కనిపెట్టే సెర్చ్ ఫర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఎంటిటీ.. ఇంటలిజెన్స్ గ్రూప్ సైతం ఇదే విషయం ప్రకటించింది.
కాశ్మీర్‌లో ఐసీస్ ఉనికే లేదని, అలాంటప్పుడు ప్రావిన్స్ ఏర్పాటు చేయడం అసంభవమని సైట్ డైరెక్టర్ రీటా కట్జ్ స్పష్టం చేశారు. అయితే ఉగ్రవాద సంస్థ చేసిన ప్రకటనను తేలికగా తీసుకోవద్దని ఆమె హెచ్చరించారు.

ఉనికి చాటుకునే ప్రయత్నం
భారత్‌లో స్థావరం గురించి ప్రకటించిన సంస్థ ఎక్కడ ఏర్పాటు చేసిందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. గత కొంతకాలంగా ఐసీస్ సంస్థ మధ్య ప్రాచ్యంలో పట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో మరోసారి తన ఉనికి చాటుకునేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ గతంలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ఐసీస్ ప్రకటన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర కదలికలపై నిఘా సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి.












Click it and Unblock the Notifications