దక్షిణ దక్కేనా: కాంగ్రెస్‌లో ఐటి దిగ్గజం నీలేకని(పిక్చర్స్)
బెంగళూరు: ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని ఆదివారం లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నందన్ నీలేకని దేశ ప్రజలకు ఆధార్ కార్డులు జారీ చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నందన్ నీలేకనిని బెంగళూరు లోకసభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరుసటి రోజే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆరంభంలోనే విషమ పరీక్షకు సిద్ధమయ్యారు.
కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు జి పరమేశ్వర ఆదివారం బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డప్పు వాయిద్యాల హోరు నడుమ నీలేకనిని తమ పార్టీలోకి స్వాగతించారు.

నందన్ నీలేకని
కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు జి పరమేశ్వర ఆదివారం బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డప్పు వాయిద్యాల హోరు నడుమ నీలేకనిని తమ పార్టీలోకి స్వాగతించారు.

నీలేకని
సభ్యత పత్రాన్ని పూర్తిచేయడానికి ముందు నీలేకనికి కాంగ్రెస్ పతాకాన్ని అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నీలేకని (58) మాట్లాడుతూ, ఢిల్లీలో బెంగళూరుకు బలమైన నాయకుడి అవసరం ఎంతో ఉందన్నారు.

నందన్
ఈ లోటును తీర్చేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని అన్నారు. ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితరులతో కలసి 1981లో కేవలం 250 అమెరికా డాలర్ల పెట్టుబడితో ఇన్ఫోసిస్‌ను ఏర్పాటు చేసిన నీలేకని ఆ సంస్థను భారత ఐటి దిగ్గజంగా తీర్చిదిద్దారు.

కాంగ్రెసులోకి
నీలేకని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి యోధుడు అనంత్ కుమార్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. దక్షిణ బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఐదుసార్లు తిరుగులేని విజయాలు సాధించిన అనంత్ కుమార్ మళ్లీ ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

బెంగళూరు
ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని ఆదివారం లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నందన్ నీలేకని దేశ ప్రజలకు ఆధార్ కార్డులు జారీ చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

కర్నాటక
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నందన్ నీలేకనిని బెంగళూరు లోకసభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరుసటి రోజే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆరంభంలోనే విషమ పరీక్షకు సిద్ధమయ్యారు.
-
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications