ఇండియానే ప్రథమ శత్రువు: జైష్ ఏ మొహమద్ ప్రకటన
న్యూఢిల్లీ: జైషే ఏ మొహమ్మద్ ఇండియాను ప్రథమ శత్రువుగా ప్రకటించింది. భారత్ 69వ, గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న సమయంలో జైష్ ఏ మొహమ్మద్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
పాకిస్థాన్‌లోని సింద్ రాష్ట్రంలోని లర్కానాలో ఓ బహిరంగ సభలో అజార్ సోదరుడు జైషే కీలక నేత మౌలానా తల్హా సైఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు.హిందుస్తాన్‌పై జిహాద్‌కు ముందుకురావాలని యువతను రెచ్చగొట్టాడు.

మనకు నంబర్ 1 శత్రువు ఇండియా, నంబర్ 2 మోదీ. అల్ ఖలామ్ పత్రిక ద్వారా ఈ సందేశాన్ని ప్రచురించింది. జైష్ నేత అజాహర్ నేతృత్వంలో ఈ పత్రిక నడుపుతున్నారు. భారత్‌లోని మనవాళ్లు అల్ ఖలామ్ వెబ్‌సైట్ ద్వారా విషయాలను తెలుసుకోవచ్చు. ఉపఖండంలో మినీ సూపర్ పవర్‌గా వ్యవహరిస్తోన్న భారత్.. మొదటి నుంచీ పాకిస్తాన్‌కు అడ్డంకులు సృష్టిస్తూనేఉందన్నారు.. కానీ కశ్మీర్‌లో మాత్రం భారత సైన్యం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు.
కశ్మీరీ తల్లులు, సోదరీమణులు సాయం కోసం మనల్ని పిలిచారు.. కానీ మనం మాత్రం బానిసలుగా ఉండిపోయామన్నారు.. కానీ ఇప్పుడు.. ముజాహిద్దీన్‌లు సరిహద్దు దాటి చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఇండియాపై జిహాద్ చెయ్యడానికి ధైర్యవంతులైన యువకులు మరింత మంది ముందుకురావాలని అని మౌలానా సైఫ్ వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications