కశ్మీర్‌లో జైషే ఉగ్రవాది మహ్మద్ ఇక్బాల్ అరెస్ట్

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో సుందర కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుటీల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనుమానిత ఉగ్రవాదులు దాడులు చేయడంతో ఇద్దరు పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా ఉగ్రవాది పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాది జైషే మహ్మద్‌కు చెందిన వారని భద్రతా బలగాలు పేర్కొన్నారు.

Jammu and Kashmir: Jaish-e-Mohammed terrorist arrested in Baramulla

బారాముల్లలో జైషే మహ్మద్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బరాముల్లలో ఉగ్రవాది నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. బారాముల్లలో డెలినాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అతను మహ్మద్ ఇక్బాల్ నైకు అలియాస్ ఖితాబ్‌గా గుర్తించారు. ఖితాబ్ .. అబ్దుల్ నైకు కుమారుడుని పేర్కొన్నారు. ఖితాబ్ స్వస్థలం బారాముల్లాలోని సుహైలో కాలనీ అని అధికారులు పేర్కొన్నారు. అతని వద్ద ఆయుధాలు, మందుగుండును కూడా స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+