పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేత: సాంబలో వ్యక్తి అరెస్ట్
శ్రీనగర్: భద్రతా దళాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వ్యక్తిని జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్ కుమార్ అనే వ్యక్తి జిల్లాలోని భద్రతా దళాలకు చెందిన పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
2018 నుంచి కుల్జీత్ ఈ గూఢచర్యం కొనసాగిస్తున్నాడని అధికారులు తెలిపారు. ఇందుకు పాకిస్థాన్ నుంచి అతడికి భారీగా నగదు అందుతోందని చెప్పారు. కుల్జీత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, పలు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సెల్‌ఫోన్లలో సాంబ జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అంతేగాక, సరిహద్దు వెంబడి పరిస్థితిపై కూడా అతడు పాక్‌కి సమాచారం చేరవేశాడని తెలిపారు.
Jammu and Kashmir: Police have arrested from Samba district a person, Kuljeet Kumar, for allegedly spying for Pakistan. pic.twitter.com/HPkBVeRqbT
— ANI (@ANI) October 8, 2020
దేశ ద్రోహం కేసులో కుల్జీత్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సాంబ జిల్లా ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ తెలిపారు. పాకిస్థాన్‌తో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం చేరవేశాడనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications