బెంగళూరుకు కావేరీ నీరు: రూ. 5,500 కోట్ల వ్యయం, జపాను రుణం, ఢిల్లీలో ఒప్పందం!
న్యూఢిల్లీ: కావేరీ తాగునీటి సరఫరా పథకంలో భాగంగా జపాన్ తో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బెంగళూరు నగరంతో సహ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందించడానికి రూ. 5, 500 కోట్ల వ్యయంతో 5వ స్టేజ్ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ ప్రతినిధి తకోమా, జపాన్ రాయబారి హిరామట్టు, భారత ప్రభుత్వ అర్థిక వ్యవహారాల ఉప కార్యదర్శి ఎస్. సెల్వకుమార్ బుధవారం ఢిల్లీలో కావేరీ తాగునీటి సరఫరా ఐదవ స్టేజ్ పనుల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

కావేరీ నది నుంచి ప్రతి రోజూ 7.5 శాతం నీరు వెలికి తీసి శుద్ది చేసి బెంగళూరు నగరంతో పాటు బీబీఎంపీ పరిధిలోకి వచ్చే గ్రామాలకు తాగునీరు సరఫరా చెయ్యనున్నారు. కావేరీ తాగునీటి సరఫరా ఐదవ స్టేజ్ పనులకు రూ. 5. 500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.
రూ. 5. 500 కోట్ల వ్యయంలో 85 శాతం రుణం ( రూ. 4,500 కోట్లు) ఇవ్వడానికి జపాన్ అంగీకరించింది. మిగిలిన 15 శాతంలో కర్ణాటక ప్రభుత్వం 7.5 శాతం, బెంగళూరు జలమండలి 7.5 శాతం ఇవ్వనుంది. 2019లో ప్రారంభం అయ్యే కావేరీ ఐదవ స్టేజ్ తాగునీటి సరఫరా పనులు 2022లో పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications