ఆస్తుల విలువ మదింపులో తేడా, జయ బృందానికి విముక్తిలా..
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో కోర్టులు ఆమె ఆస్తుల విలువను పలు రకాలుగా లెక్కించాయి. ఒక్కో కోర్టు ఒక్కో రకంగా ఆమె ఆస్తి విలువను తేల్చాయి.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో కోర్టులు ఆమె ఆస్తుల విలువను పలు రకాలుగా లెక్కించాయి. ఒక్కో కోర్టు ఒక్కో రకంగా ఆమె ఆస్తి విలువను తేల్చాయి.
1996 లో జయలలితపై అక్రమంగా ఆస్తులను సంపాదించిందని సుబ్రమణ్యస్వామి కేసును దాఖలు చేశాడు. ఈ కేసు ఆధారంగానే జయ జైలు ఊచలను లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఉన్న కాలంలోనే ఈ కేసు విచారణకు అనుమతి లభించింది. ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ మర్రిచెన్నారెడ్డి మద్య కాలంలో విబేధాల కారణంగానే ఈ కేసు దాఖలైనట్టు అన్నాడిఎంకె వర్గాలు చెబుతున్నాయి.
ఒక్క రూపాయి జీతం తీసుకొనే జయలలిత ఆస్తులను ఎలా కూడబెట్టారంటూ సుబ్రమణ్యస్వామి కేసును దాఖలు చేశారు. ఈ కేసే జయలలితకు చుట్టుకొంది.

సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన కేసు ఏమిటి
సుబ్రమణ్యస్వామి ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలతో జయలలితపై కేసు దాఖలు చేశారు. 1995 ఏప్రిల్ 1వ,తేదిన జయలలితపై కేసును దాఖలు చేస్తున్నట్టుగా సుబ్రమణ్య స్వామి ప్రకటించారు.రూ.66.5 కోట్ల అక్రమాస్తులను జయలలిత కలిగిఉన్నారని ఆమెపై 1996 లో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడానికి సుబ్రమణ్యస్వామియే కారణం.21 ఏళ్ళ పాటు ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.

జయ ఆస్తుల్లో తేడాలు
జయలలిత అక్రమాస్తుల కేసులో కింది కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. కానీ, హైకోర్టు వారిని వదిలిపెట్టలేదు. ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరగా, హైకోర్టు లెక్కలను తప్పుబట్టింది. కింది కోర్టు లెక్కలనే సమర్థించింది.జయలలిత ఆస్తులను హైకోర్టు అంచనా వేయడంలో వచ్చిన తేడా వల్ల నిందితులకు ఊరట లభించింది. ఆస్తుల విలువలో తేడాను హైకోర్టు 8.2 శాతం గా లెక్కగట్టి అనుమతించదగిన తేడాగా పేర్కొంటూ నిందితులను వదిలేసింది.

హైకోర్టులో జయ ఆస్తుల విలువ
జయ అక్రమాస్తులను కలిగి ఉందనే ఆరోపణలతో పలు కోర్టుల్లో విచారణ సాగింది.అయితే హైకోర్టులో విచారణ సందర్భంగా ఆస్తుల లెక్కింపు ఒక్కో కోర్టులో ఒక్కో రకంగా ఉంది .హైకోర్టులో సాగిన లెక్కింపు ఈ రకంగా ఉంది.జయలలితకు 914 పట్టుచీరెలున్నాయి6195 జతల దుస్తులున్నాయి. హైకోర్టు వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. సినీ నటి కావడం వల్లే నిర్మాతల నుండే ఇవి వచ్చాయని హైకోర్టు అభిప్రాయపడింది.చెప్పులను కూడ లెక్కలోకి తీసుకోలేదు. బంగారు, వజ్రాభరణాలను ఎసీబి విలువను పరిగణనలోకి తీసుకొంది. రుణాలను ఆదాయంగా చూపడం ఏసీబీ పరిణనలోకి తీసుకోలేదు.

సెషన్స్ కోర్టులో జయ ఆస్తుల విలువ
జయలలిత ఆమె సంస్థలు నిర్మించిన భవనాల విలువ సుమారు రూ.27.79 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఇవి కాకుండా మరో 150 ఆస్తుల విలువ సుమారు రూ.20.07 కోట్లు ఉంటుందని అంచనావేసింది.సుధాకరన్ వివాహ ఖర్చు సుమారు.రూ.6.45 కోట్లు, బహుమతులు రూ.2.15 కోట్లు , విదేశీ బహుమతులు సుమారు 77 లక్షలు ఉంటుందని అంచనా వేసింది.

సెషన్స్ కోర్టు కు, హైకోర్టుకు ఆస్తుల విలువలో తేడా
జయలలిత, ఆమె సంస్థలు నిర్మించిన భవనాల విలువను హైకోర్టు రూ.22.69 కోట్లుగా నిర్ణయించింది.అయితే సెషన్స్ కోర్టు ఈ భవనాల విలువను రూ.27.79 కోట్లుగా గుర్తించింది. జయలలితకు ఉన్న 150 ఆస్తుల విలువ సేల్స్ డీడ్ల ప్రకారంగా రూ.6.24 కోట్లుగా హైకోర్టు నిర్ధారించింది అయితే సెషన్స్ కోర్టు వీటి విలువను 20.07 కోట్లుగా గుర్తించింది.సుధాకరన్ పెళ్ళి ఖర్చును హైకోర్టు కేవలం రూ.28.68 లక్షలకే పరిమితం చేసింది. సెషన్స్ కోర్టు 6.45 కోట్లుగా లెక్క తేల్చింది.బహుమతుల విలువను హైకోర్టు 1.5 కోట్లుగా తేల్చింది.కాని, సెషన్స్ కోర్టు మాత్రం వీటి విలువ సుమారు 2.80 లక్షలుగా తేల్చింది.ఈ రెండు కోర్టుల్లో ఆస్తుల విలువల్లో తేడా కారణంగా హైకోర్టు ఆమెకు శిక్ష విధించలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications