దోస్తీ మోడీకి ఎసరు!: ఎమ్మెల్యేపై 'జయా'గ్రహం వెనుక..!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితకు ఆగ్రహం వచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి తమ పార్టీ అధినేత్రి మంచి ఫ్రెండ్ అని చెప్పినందుకు ఓ పార్టీ ఎమ్మెల్యేను ఆమె బహిష్కరించారు.
శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఆచితూచి స్పందిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎవరు ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని జయలలిత ఎమ్మెల్యేను బహిష్కరించడం ద్వారా మిగిలిన పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ పంపారు.
జయ, మోడీ మంచి స్నేహితులని చెప్పిన పార్టీ ఎమ్మెల్యే కె మలయసామిని జయలలిత గురువారం పార్టీ నుండి బహిష్కరించారు. తద్వారా మిగతా వారికి హెచ్చరికలు జారీ చేశారు.

జయలలిత
మే 16 నాటి ఫలితాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు అనుకూలంగా ఉంటాయని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే.

జయలలిత
పలు మీడియా సంస్థలు ఈ నెల 12వ చివరి దశ ఎన్నికలు పూర్తి కాగానే తమ తమ ఎగ్జిట్ పోల్ సర్వేలను విడుదల చేశాయి. అన్నింటిలోను బిజెపి హవానే కనిపించింది.

జయలలిత
ఎగ్జిట్ పోల్ ప్రకారం... గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని అందరు భావిస్తున్నారు.

జయలలిత
ఈ నేపథ్యంలో అన్నాడిఎంకె పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మలయస్వామి బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

జయలలిత
మోడీ, తమ పార్టీ అధినేత్రి జయలలిత మంచి స్నేహితులను ఎన్డీయే అధికారంలోకి వచ్చే అవకాశముంటే జయలలిత ఎన్డీయేతో కలిసే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు జయకు ఆగ్రహం కలిగించాయి. కాగా, మమతా బెనర్జీ కూడా ఎన్డీయేలో చేరేది లేదని చెబుతున్నారు.

జయలలిత
పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మలయస్వామి చేసిన వ్యాఖ్యలను అధినేత్రి జయలలిత జీర్ణించుకోలేకపోయారు. ఆయనను గురువారం పార్టీ నుండి బహిష్కరించారు.

జయలలిత
2004, 2009లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని సర్వేలు ఊదరగొట్టాయి. అయినా తారుమారయింది. ఈ నేపథ్యంలో జయలలిత ఆచితూచి ముందడుగు వేస్తున్నారు.

జయలలిత
జయలలితకు ప్రధానమంత్రి కావాలనే కోరిక ఉందనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయేకు కాకుండా థర్డ్ ఫ్రంట్‌కు అవకాశాలు ఉంటే... తనకే ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె భావిస్తోంది.

జయలలిత
థర్డ్ ఫ్రంట్‌కు అవకాశముంటే... ఆ కూటమిలో జయలలిత చేరితే, మిగతా పార్టీల కంటే ఎక్కువ లోకసభ స్థానాలు గెలుచుకునే పార్టీలో జయలలిత పార్టీయే ముందుంటుంది. ఆ పార్టీ దాదాపు 31కి పైగా లోకసభ స్థానాలు గెలుచుకునే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి.

జయలలిత
దీంతో అప్పుడే ఎన్డీయేలో చేరుతామని తొందరపడవద్దని ఆమె అభిప్రాయంగా కనిపిస్తోంది. థర్డ్‌కు అవకాశముండి, తానే ప్రధాని అయ్యే పక్షంలో ఆమె ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉంటారు. అలా కాకుండా ఎన్డీయేకు అవకాశముంటే ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చుననేది ఆమె భావనగా అభిప్రాయపడుతున్నారు.

జయలలిత
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితకు ఆగ్రహం వచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి తమ పార్టీ అధినేత్రి మంచి ఫ్రెండ్ అని చెప్పినందుకు ఓ పార్టీ ఎమ్మెల్యేను ఆమె బహిష్కరించారు.

జయలలిత
శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఆచితూచి స్పందిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎవరు ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని జయలలిత ఎమ్మెల్యేను బహిష్కరించడం ద్వారా మిగిలిన పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ పంపారు.

జయలలిత
జయ, మోడీ మంచి స్నేహితులని చెప్పిన పార్టీ ఎమ్మెల్యే కె మలయసామిని జయలలిత గురువారం పార్టీ నుండి బహిష్కరించారు. తద్వారా మిగతా వారికి హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications