జయ అప్పుడే మొదలెట్టింది: మసీదులకు ఉచిత బియ్యం
చెన్నై: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఓ తీపికబురు చెప్పారు. తమిళనాడులో గుర్తింపు పొందిన 3 వేలకు పైగా మసీదులకు రంజాన్ మాసం మొత్తం ఉచితంగా బియ్యం సరఫరా చేయనున్నారు.
ఇందుకోసం 4,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధం చేసినట్లు జయమ్మ ప్రకటించారు. వక్ఫ్ బోర్డు గుర్తింపు పొందిన మసీదులకు నెల మొత్తం ఉచిత బియ్యం పపిణీకి చర్యలు తీసుకోవాలని గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది.

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని సీఎం జయలలిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2001లో అన్నాడీఎంకే అధికారంలో వచ్చాక ఈ పథకం ప్రారంభమైంది.
ఆ తర్వాత కొన్నాళ్ల పాటు అటకెక్కిన ఈ పథకాన్ని జయలలిత తాజాగా పునరుద్ధరించారు. ముఖ్యమంత్రి జయలలిత తాజా నిర్ణయంపై ముస్లిం వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications