జయలలిత ఆస్తుల కేసు: సాగిన క్రమంబెట్టిదనిన?

చెన్నై: ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అక్రమాస్తుల కేసు 18 ఏళ్ల పాటు సాగి చివరికి క్లైమాక్స్‌కు చేరుకుంది. కేసులో ఆమె దోషిగా తేలడంతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. జయలలిత దోషిగా నిర్దారణ అయిన వెంటనే అన్నాడియంకె నేతలు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. తమిళనాడులో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులను ఆపేశారు. కేబుల్ ప్రసారాలను నిలిపేశారు.

జయలలిత కేసు కీలక పరిణామాలు ఈ క్రమంలో జరిగాయి.

# 1996లో జూన్‌లో జయలలితపై సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేశారు.

# జయలలిత అక్రమాస్తులపై విచారణ జరపాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

# జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాది పాటు విచారణ జరిపి 1997లో చార్జిషీట్ దాఖలు చేశారు.

# అక్టోబర్‌లో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇలవరసిలపై అభియోగాలు నమోదయ్యాయి.

# 2002 మార్చిలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు.

Jayalalithaa's assets case: Timeline

# 2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు.

# విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్నుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

# 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూర్ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది.

# 2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

# 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారు.

# 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఆమె విచారణకు హాజరయ్యారు.

# 2012లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జి. భవానీ సింగ్ నియమితులయ్యారు.

# దానిపై అన్బుగన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో కర్ణాటక కోర్టు భవానీ సింగ్‌ను తప్పించింది.

# తనను తప్పించడంపై భవానీ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

# ఈలోపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బాలకృష్ణ పదవీ విరమణ చేశారు.

# నూతన న్యాయమూర్తిగా జాన్ మైఖైల్ నియమితులయ్యారు.

# 2014 ఆగస్టులో విచారణ పూర్తయింది.

# తీర్పును వాయిదా వేయాలని కోరుతూ జయలలిలత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

# తీర్పు వాయిదా కుదరదని, ఈ నెల 27వ తేదీన తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+