జయలలిత, శశికళ కేసు మళ్లీ విచారిస్తాం: షాకిచ్చిన సీఎం
బెంగళూరు: ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని కొనసాగించాలని కర్ణాటకలోని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేస్తూ జయలలిత మృతి చెందిన కారణంగా ఈ వ్యాజ్యాన్ని ముగించరాదని, సుప్రీం కోర్టులో విన్నవించాలని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర న్యాయశాఖ ఉన్నతాధికారులు బెంగళూరులో వెల్లడించారు.

జయలలిత అక్రమాస్తుల కేసులో నెచ్చెలి శశికళ, సుధాకరన్, ఇళవరసి నిందితులు. ఈ అక్రమార్జనలో వీరంతా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు చిన్నది కాదని, గంభీరమైన కేసు అని గుర్తు చేశారు.
అందువలన సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని విచారించాలని మనవి చెయ్యాలని కర్ణాటకలోని సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని న్యాయశాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద నెచ్చెలి శశికళ అండ్ కోకు మళ్లీ కష్టాలు మొదలైనాయి. 2016 జూన్ 7వ తేదిన వాదనలు పూర్తి కావడంతో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో పెట్టంది.












Click it and Unblock the Notifications