కోలుకుంటున్న జయ: తిరిగి లండన్‌కు బయల్దేరిన విదేశీ వైద్య బృందం
చెన్నై: జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించడానికి శుక్రవారం సాయంత్రం లండన్ నుంచి విదేశీ వైద్య బృందం చెన్నైకి వచ్చిన సంగతి తెలిసిందే.
లండన్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ డా. రిచర్డ్ జాన్ బేలే నేతృత్వంలోని వైద్యులు జయలలితకు పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం కుదుటపడటంతో లండన్ నుంచి వైద్య బృందం తిరిగి స్వదేశానికి బయల్దేరారు.
కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని అపోలో ఆసుపత్రి వైద్యులు నిరంతం సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సోమవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం పూర్తి నివేదిక అందజేయాలని, ఆమెను అపోలోలో మంత్రులు, ఉన్నాతాధికారులతో సమావేశమైనట్లు చెప్తున్నారని ఆ ఫొటోలను విడుదల చేయాలని రామస్వామి తన పిటిషన్‌లో కోరారు. ఆమె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రజలంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు జయలలిత ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆసుపత్రి వర్గాలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి. లండన వైద్య నిపుణుడి సలహాలు, సూచనల మేరకు తాము అందిస్తున్న చికిత్సకు జయ స్పందిస్తున్నారని వెల్లడించాయి. ఆమె మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని పేర్కొన్నాయి.
సెప్టెంబర్ 22 తర్వాత ఆమె అపోలో ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆసుపత్రి వర్గాలు నాలుగో హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. జయకు అందిస్తున్న చికిత్సల పట్ల డాక్టర్ రిచర్డ్ బీలే సంతృప్తి వ్యక్తంచేశారని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. జయ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని చెప్పడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications