జయ వారుసురాలిని నేనే, అన్ని బయటపెడ్తా: శశికళపై దీపా జయకుమార్ ఫైర్
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆమె స్నేహితురాలు శశికళ అంత్యక్రియలు నిర్వహించడంపై జయ మేనకోడలు దీపా జయకుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మెరీనా బీచ్‌లో జయలలిత మహా సమాధిని సందర్శించి నివాళులర్పించారు.
Photos : అమ్మకు ప్రముఖుల నివాళి

ఆవేదన
ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. ‘మా అత్తకు శశికళ అంతిమ సంస్కారం నిర్వహించడమేంటని, ఆ దృశ్యాలు తమ కుటుంబానికి తీవ్ర ఆవేదన కలిగించాయి' అని అన్నారు.

అడ్డుకున్నారు
జయలలిత మృతికి సంబంధించి బయటకు తెలియని అనేక అంశాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని తెలిపారు. వేద నిలయంలోకి వెళ్లనివ్వకుండా తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

నిజమైన వారసురాలిని..
అంతేగాక, జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని ఆమె ప్రకటించారు. చెన్నై టీనగర్లో నివశిస్తున్న దీపా జయకుమార్ గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారు. ఈమె జయలలిత దివంగత సోదరుడు జయకుమార్ కుమార్తె.

అచ్చం జయలాగే..
ఇది ఇలా ఉండగా, జయకు నివాళులర్పించేందుకు వచ్చిన దీపా జయకుమార్‌ను ప్రజలు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. అచ్చం జయలలితలాగే ఉన్నావంటూ ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో పోలీసులు ఆమెను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ్నుంచి ఆమె తన కారులో ఇంటికి వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications