పోలీస్ ఇలానా?: యువతి నడుంకి తాళ్లు కట్టి అరెస్ట్

అల్వార్: మానవ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిచారు జార్ఖండ్ పోలీసులు. వరకట్న వేధింపుల కేసులో నిందితురాలిగా ఉన్న ఓ 23ఏళ్ల యువతిని తాళ్లతో కట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ తతంగాన్ని ప్రజలు, మీడియా చూస్తున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.

వివరాల్లోకి వెళితె.. గఱ్వా జిల్లాలోని బ్యాంకు కాలానికి చెందిన అపర్ణ(23) వరకట్న వేధింపుల కేసులో నిందితురాలు. వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని అపర్ణ కుటుంబంపై ఆమె వదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం అపర్ణ ఇంటికి రాగా.. ఇంట్లో అపర్ణ తప్ప ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఎవరూ లేరు. దీంతో పోలీసులు అపర్ణను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Jharkhand cops tie up girl in ropes, take her back

అయితే, పోలీసుల నుంచి తప్పించుకుని అపర్ణ పారిపోయింది. పోలీసులు వెంటపడి ఆ యువతిని పట్టుకున్నారు. అపర్ణ పారిపోకుండా ఉండేందుకు ఆమె నడుముకు తాడు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అంతేగాక, అల్వార్ పోలీస్ స్టేషన్ నుంచి జార్ఖండ్‌కు వెళ్లే రైలులో కూడా అపర్ణకు తాడు కట్టి తీసుకెళ్లారు. కాగా, యువతి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+