5జీ పూర్తి కవరేజీ వచ్చేసిందోచ్ - అన్‌లిమిటెడ్ డేటా, ప్లాన్, స్పీడ్..!!
ముంబై: దేశ రాజధానిలో 5జీ నెట్‌వర్క్ సేవలు ప్రారంభం అయ్యాయి. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగిలిన సర్వీస్ ప్రొవైడర్ల కంటే ముందుగానే ఈ సేవలను వినియోగదారులకు అందించింది. తొలిదశలో ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో ఈ సేవలను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలను రూపొందించుకుంది రిలయన్స్ జియో మేనేజ్‌మెంట్.

ఇదివరకే వేలం..
5జీ సర్వీసుల కోసం ఉద్దేశించిన స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే వేలం వేసిన విషయం తెలిసిందే. 4జీతో పోల్చుకుంటే 10 రెట్ల వేగం ఉంటుంది 5జీకి. 20 సంవత్సరాల పాటు కాల పరిమితితో ఈ వేలం పాటలను టెలికాం శాఖ నిర్వహించింది. 72097.85 మెగా హెర్ట్జ్ సామర్థ్యం గల స్పెక్ట్రమ్ 5జీని వేలానికి ఉంచగా.. టెలికం ఆపరేటర్లు పోటీపడ్డాయి. ది. మొత్తం మూడు ఫ్రీక్వెన్సీల్లో ఈ వేలంపాటను పొందాయి.

మూడు ఫ్రీక్వెన్సీల్లో..
లో- రేంజ్ అంటే.. 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగా హెర్ట్జ్, మిడ్ రేంజ్ అంటే.. 3300 మెగా హెర్ట్జ్, అలాగే హై రేంజ్ అంటే.. 26 గిగా హెర్ట్జ్ సామర్థ్యంతో ఈ స్పెక్ట్రమ్ వేలంపాటను ముగించింది కేంద్రం. మిడ్ అండ్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో, గౌతమ్ అదాని నాయకత్వాన్ని వహిస్తోన్న అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు పోటీ పడ్డాయి. సునీల్ మిట్టల్‌కు చెందిన భారతి ఎయిర్‌టెల్, కుమారమంగళం బిర్లా ఆధీనంలోని వొడాఫోన్ ఐడియా బిడ్స్ దాఖలు చేశాయి.

ఆ కంపెనీల కంటే..
వేలంలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్ జియో యాజమాన్యం- మిగిలిన సర్వీస్ ప్రొవైడర్ల కంటే ముందుగా వాటిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో ఈ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీ, గుర్‌గావ్, నొయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ సహా ఎన్సీఆర్ పరిధిలోని ప్రధార రీజియన్లల్లో జియో 5జీ సేవలను ప్రారంభించినట్లు ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది.

ట్రూ 5జీ నెట్‌వర్క్..
ట్రూ 5జీ నెట్‌వర్క్ పేరుతో ఈ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది రిలయన్స్ జియో. అన్ని ప్రధాన ప్రాంతాలు, రెసిడెన్షియల్ ఏరియాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, జనం సమ్మర్థంతో కూడిన మార్గాలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, టెక్ పార్కులు, ఎన్సీఆర్ పరిధిలోని జాతీయ రహదారులను జియో 5జీ పరిధిలోకి తీసుకొచ్చామని పేర్కొంది.

స్పీడ్ ఇదే..
ఒక సెకెనుకు ఒక జీబీ ప్లస్ (వన్ జీబీపీఎస్ ప్లస్) వేగంతో అపరిమిత 5జీ డేటాను అందించనున్నామని జియో యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే జియో వెల్‌కమ్ ఆఫర్‌కు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో లక్షలాది మంది వినియోగదారులు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారని పేర్కొంది. డిసెంబర్ నాటికి కోల్‌కత, 2023 జూన్ నాటికి దేశం మొత్తంగా 5జీ పూర్తి కవరేజీని అందిస్తామని చెప్పారు. జియో సేవలను ఇటీవలే హైదరాబాద్, బెంగళూరుల్లో ప్రవేశపెట్టామని గుర్తు చేసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications