అవినీతిని పెకిలించాల్సిన అవసరం ఉంది.. తిరుపతి ప్రచారంలో నడ్డా
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. ఇవాళ నాయుడుపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి మయం అని విమర్శించారు. తిరుపతి ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి రత్నపభ తరపున ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన బంధు ప్రీతి ఉందన్నారు.
రాష్ట్రంలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని జేపీ నడ్డా చెప్పారు. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏపీలో సెక్యులరిజం లేదనిపిస్తోందన్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో మత మార్పిడులు జరుగుతున్నాయని నడ్డా విరుచుకుపడ్డారు. ఒక మతం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నట్టు అనిపిస్తోందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో విపరీతమైన అవినీతి జరుగుతోందని చెప్పారు. లిక్కర్, శాండ్, ల్యాండ్, పోర్టుల్లో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందని వివరించారు. ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. ఏపీ అప్పులు 4 లక్షల కోట్లకు చేరుకున్నాయని.. దీంతో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.
ఇప్పటికీ రాయలసీమ ప్రాంతం ఎంతగానో వెనుకబడిపోయింది అని జేపీ నడ్డా అన్నారు. అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జగన్‌కు మాత్రం ఇవేమి పట్టవు అని చెప్పారు. కానీ పైకి మాత్రం నీతులు చెబుతారని వివరించారు. అవన్నీ వినడానికే బాగుంటాయని.. రియాల్టీ అందుకు విరుద్దం అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications