సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా..గెస్ట్‌గా ఏపీ గవర్నర్ !!
51st Chief Justice of India: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన దైవసాక్షిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఆయన 51వ ప్రధాన న్యాయమూర్తి.
ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్ర మనోహర్ లాల్ ఖట్టర్, పలువురు కేంద్రమంత్రులు, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. గవర్నర్‌గా అపాయింట్‌మెంట్ కావడానికి ముందు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీజేఐ సంజీవ్ ఖన్నాకు శుభాకాంక్షలను తెలియజేశారు.
ఆరు నెలల పాటు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా విధులను నిర్వర్తిస్తారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. వచ్చే సంవత్సరం మే 13వ తేదీ వరకు ఆయన ఈ హోదాలో కొనసాగుతారు. ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన డీవై చంద్రచూడ్ మూడు రోజుల కిందటే పదవీ విరమణ చేశారు.
తన తరువాతి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీన్ని 24వ తేదీన నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ఖరారు చేసింది. దీనితో ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications