ముంబైలో అర్థరాత్రి పాప్ సంచలనం: ఉర్రూతలూగించే 'షో' నేడే!

ఇండియాలో బీబర్ పర్యటన ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈ ఐదు రోజుల్లో ముంబై, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, వంటి ప్రాంతాల్లో బీబర్ తన పాప్ 'షో'లు ప్రదర్శించనున్నాడు.

ముంబై: అతి పిన్న వయసులో పాప్ సంచలనంగా మారిన జస్టిన్ బీబర్ తొలిసారిగా ఇండియాలో కాలు మోపాడు. భారత్ లో పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చేందుకు గాను మంగళవారం అర్థరాత్రి అతను ముంబై ఎయిర్ పోర్టులో దిగాడు. దీంతో అతన్ని చూసేందుకు అభిమానులు ఎయిర్ పోర్ట్ వద్దకు పోటెత్తారు.

ఇండియాలో బీబర్ పర్యటన ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈ ఐదు రోజుల్లో ముంబై, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, వంటి ప్రాంతాల్లో బీబర్ తన పాప్ 'షో'లు ప్రదర్శించనున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ముంబైలోని డీవై పాటిల స్టేడియంలో బీబర్ పాప్ షో జరగనుంది.

 Justin Bieber Arrives In India For Concert In Mumbai

దాంతో పాటు బుధవారం ఉదయం బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లోను బీబర్ పాల్గొంటాడు. కరణ్ 'షో'లో ఓ ఇంటర్నేషనల్ సెలబ్రిటీని తొలిసారిగా ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

తన 120మంది టీమ్ తో బీబర్ ప్రైవేట్ విమానంలో ముంబైలో అడుగుపెట్టాడు. ఇప్పటికే అతని కోసం ముంబై, ఢిల్లీలోని రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ప్రత్యేక సూట్స్ ను సిద్దం చేశారు. కాగా, బీబర్ రక్షణ కోసం సల్మాన్ ఖాన్ బాడీగార్డు మూడు రోజుల పాటు బీబర్ కు రక్షణ కల్పించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+