టీవీ, చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ గాయని ఆత్మహత్య: తల్లికి వాట్సప్ మెసేజ్‌లో నిజాలు..
బెంగళూరు: వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలకు మరో వివాహిత బలి అయ్యారు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ తల్లికి వాట్సప్ ద్వారా మెసేజ్‌ను పంపించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు డెత్ నోట్‌ను కూడా రాశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి అల్లుడు, అతని తల్లిదండ్రులే కారణమని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం కన్నడ చిత్ర పరిశ్రమ, టీవీ రంగంలో కలకలం సృష్టించింది.

ప్రేమించి, పెళ్లి చేసుకున్నప్పటికీ..
మృతురాలి పేరు సుస్మిత. కన్నడనాట ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటోన్న వర్ధమాన గాయని. కొన్ని కన్నడ సినిమాలు, టీవీ సీరియళ్లు, స్టేజీ షోల ద్వారా ఆమె పేరు తెచ్చుకున్నారు. హాలు-తుప్ప, శ్రీసామాన్య వంటి సినిమాలతో పాటు కొన్ని సీరియళ్లకు ఆమె గాత్రాన్ని అందించారు. సుస్మితకు ఏడాదిన్నర కిందట ఆమె వివాహమైంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న శరత్ అనే యువకుడిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అదనపు కట్నం కోసం వేధింపులు..
వివాహమైన తొలి రోజుల నుంచే అత్తింటి వేధింపులను ఎదుర్కొన్నారు. అదనపు కట్నం కోసం శరత్, అతని తల్లిదండ్రులు సుస్మితను వేధించే వారని మృతురాలి తరఫు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ కారణం వల్లే సుస్మిత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారు. బెంగళూరు నాగరభావి ప్రాంతంలోని తన పుట్టింట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో- సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుస్మిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు డెత్ నోట్‌ను రాశారు.

అత్తింట్లో చనిపోవడం ఇష్టం లేక..
తల్లికి వాట్సప్ ద్వారా మెసేజీని పంపించారు. తన భర్త శరత్, అతని తరఫు బంధువులను ఎవ్వర్నీ వదలొద్దని ఇందులో పేర్కొన్నారు. అత్తవారింట్లో ఆత్మహత్య చేసుకోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని, తాను పుట్టి, పెరిగిన ఇంట్లోనే ప్రాణం వదలాలని నిర్ణయించుకున్నట్లు సుస్మిత.. డెత్‌నోట్‌లో పేర్కొన్నారు. తల్లిదండ్రులు వద్దని వారించినప్పటికీ.. తాను శరత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తాను జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఆమె ఇందులో రాశారు.
Recommended Video


కేసు నమోదు చేసిన పోలీసులు..
పెళ్లయిన తొలి రోజుల నుంచే తనను చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా కొట్టేవారని, అందరి ముందూ తిట్టేవారని చెప్పారు. అత్తింటి వారి వేధింపుల గురించి తాను శరత్‌కు వివరించినప్పటికీ.. అతను పట్టించుకోలేదని అన్నారు. తన మరణానికి శరత్, వైదేహి, గీత ప్రధాన కారణమని డెత్‌నోట్‌లో రాశారు. ఈ ఘటనపై అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సుస్మిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు సాగిస్తున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications