తమిళ టీవీ చానళ్లు బంద్: జయకు లేఖ రాసిన సిద్దు
బెంగళూరు: కర్ణాటకకు వ్యతిరేకంగా శుక్రవారం తమిళనాడులో బంద్ నిర్వహించారు. తమిళనాడు బంద్ దృశ్యాలు ప్రసారం కాకుండా బెంగళూరు నగరంతో పాటు పలు ప్రాంతాల్లో 53 తమిళ చానళ్ల ప్రసారాలకు బ్రేక్ వేశారు.
బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో తమిళ చానళ్ల ప్రసారాలు చెయ్యరాదని కేబుల్ ఆపరేటర్లు నిర్ణయించారు. శుక్రవారం వేకువజామున అన్ని తమిళ చానళ్లు నిలిపివేశారు. తమిళనాడు బంద్ దృశ్యాలు ప్రసారం చెయ్యరాదని ఈ నిర్ణయం తీసుకున్నామని కేబుల్ ఆపరేటర్లు అన్నారు.
అయితే కొన్ని ఏజెన్సీల నుంచి సేకరించిన వీడియో క్లిప్పింగ్ లను కొన్ని కన్నడ చానళ్లు ప్రసారం చేస్తున్నాయి. బంద్ సందర్బంగా తమిళనాడులో హింస చోటుచేసుకుంటే మళ్లీ బెంగళూరులో గొడవలు జరిగే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

జయలలితకు లేఖ రాసిన సీఎం సిద్దు
చెన్నై నగరంతో సహ తమిళనాడులో నివాసం ఉంటున్న కన్నడిగులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాశారు.
తమిళనాడు బంద్ సందర్బంగా కన్నడిగులకు, కన్నడిగుల ఆస్తులకు, కార్యాలయాలకు, బ్యాంకులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సిద్దరామయ్య మనవి చేశారు. చెన్నైలోని కర్ణాటకకు చెందిన కార్యాలయాలకు, కన్నడిగులకు భద్రత కల్పించారు.
-
కర్ణాటకలో అదృశ్యమైన కేరళ అమ్మాయి మృతదేహం లభ్యం -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications