సీఎంకు స్వీట్ కౌంటర్ ఇచ్చిన డీసీఎం, తెలంగాణ ఎన్నికల తరువాత మ్యాటర్ సీరియస్ ?
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అని సిద్ధరామయ్య బహిరంగంగా చెప్పడంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం ఉలిక్కిపడింది. ఈ విషయంపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ స్పందించారు. సీఎం సీటు విషయంలో తాను బహిరంగంగా మాట్లాడను అని డీకే శివకుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏది చెబితే అది పాటించడమే తనకు తెలుసని, వేరే విషయం గురించి, వేరే వాళ్లు మాట్లాడిన మాటలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో సీఎం విషయంలో పోటాపోటీ లేదని డీకే శివకుమార్ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి పదవి కోసం బీజేపీలో పోటీ ఉందని డీకే శివకుమార్ చెప్పారు.

బీజేపీలో నాయకుల మధ్య పోటీ ఉండటం వలనే ఇంతకాలం అయినా కర్ణాటకలో ప్రతిపక్ష నేతను ఎంపిక చేయలేకపోతున్నారని డీసీఎం డీకే శివకుమార్‌కు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కొట్లాడుకుంటున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై డీకే శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్ పార్టటీలో మాకుమాకు ఎలాంటి గొడవలు లేవని, తమ వైఫల్యాలను దాచుకునేందుకు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురదచల్లుతున్నారని డీకే శివకుమార్ అన్నారు.
మా ఎమ్మెల్యేలకు గాలం వెయ్యడానికి వారికి పదవుల పేరుతో చాక్లెట్ ఇవ్వడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. ఆపరేషన్ కమల మళ్లీ తెరమీదకు తీసుకువస్తున్నారని మాకు సమాచారం ఉందని డీకే శివకుమార్ అన్నారు. ఆపరేషన్ కమల విషయంలో అవసరమైతే విచారణ జరిపించాలని మాజీ సీఎం యడ్యూరప్ప చేసిన సవాల్ పై మీడియా అడిగిన ప్రశ్నలకు డీకే శివకుమార్ సమాధానం ఇచ్చారు.

మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సలహాను దృష్టిలో ఉంచుకుంటామని డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బిజీబిజీగా ఉన్న డీకే శివకుమార్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత సీఎం సీటు విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
మూఢనమ్మకాలను నమ్మకూడదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. హోస్ పేట్ లోని శ్రీ విరూపాక్షేశ్వర ఆలయాన్ని సందర్శించిన సీఎం సిద్దరామయ్య మూఢనమ్మకాలను నేను నమ్మనని, నాకు దేవునిపై నమ్మకం ఉందని, అయితే ఇది మూఢనమ్మకాల గురించి కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ప్రతి ఒక్కరికి వారి స్వంత నమ్మకాలు ఉంటాయని, సమాజానికి మేలు చేస్తే ఆ మూడనమ్మకాలను నమ్ముదామని సీఎం సిద్దరామయ్య చెప్పారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications