49 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన జేడీఎస్: మాజీ ప్రధాని కోడలుకు షాక్

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, జేడీఎస్ కూడా 49 మందితో కూడిన తమ అభ్యర్థుల రెండో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోడలు భవాణీ రేవణ్ణకు షాక్ తగిలింది.

హాసన్ స్థానం నుంచి పోటీ చేయాలని గట్టిగా భావించిన దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణను పక్కనపెట్టి హెచ్‌పి స్వరూప్‌ను పార్టీ రంగంలోకి దించడం గమనార్హం. ఆమెను రంగంలోకి దింపబోమని, బదులుగా ఒక "విధేయతగల పార్టీ కార్యకర్త"ని పోటీలో ఉంచుతామని.. బరిలోకి దిగిన భవానీ రేవణ్ణ తన బావ, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి పదే పదే స్పష్టం చేసినా చివరి నిమిషం వరకు పట్టు వీడకపోవడంతో హాసన్ సీటు చర్చనీయాంశంగా మారింది.

 Karnataka Elections

కాగా, కుమారస్వామి అన్నయ్య హెచ్‌డి రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ, హాసన్ జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు. ఆమె కుమారుల్లో ఒకరు ప్రజ్వల్ రేవణ్ణ .. హాసన్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. మరో కుమారుడు సూరజ్ రేవణ్ణ ఎమ్మెల్సీగా ఉన్నారు. భర్తతోపాటు కుమారులు ఆమెకు మద్దుతగా నిలిచారు.

హసన్ అభ్యర్థిగా స్వరూప్ పేరును ప్రకటిస్తూ.. కుమారస్వామి తన సోదరుడు రేవణ్ణతో మాట్లాడారు. 'రేవణ్ణ, భవానీల అంగీకారంతో, హెచ్‌డి దేవెగౌడ ఆశీస్సులతో పేరు ఖరారు చేశామన్నారు. జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు హెచ్‌డి రేవణ్ణ (హోలెనరసిపుర), కెఎస్ లింగేష్ (బేలూరు), హెచ్‌కె కుమారస్వామి (సకలేష్‌పూర్), సిఎన్ బాలకృష్ణ (శ్రావణబెళగొళ) పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. జేడీ(ఎస్‌)ని వీడి కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌వీ దత్తకు అక్కడ టిక్కెట్టు నిరాకరించడంతో ఇటీవలే తిరిగి పార్టీలోకి వచ్చారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి ఎ మంజు అరకలగూడ నుంచి బరిలోకి దిగారు. ఈయన గతంలో కాంగ్రెస్, బీజేపీ రెండింటిలోనూ ఉన్నారు. జేడీ(ఎస్) డిసెంబర్‌లో 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+