బీజేపీకి సంతోషం, కాంగ్రెస్‌కు చేదు: సర్వేలో కమలానిదే ముందంజ, ప్రభుత్వానికి వారి ఆసరా

బెంగళూరు: దక్షిణాదిన మరోసారి ఖాతా తెరవాలన్న బీజేపీ ఆశలు ఫలించేలా కనిపిస్తున్నాయి. మరోవైపు, 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ. మరో రాష్ట్రాన్ని అది కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి.

విజయవాణి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీకి 105 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్‌కు 33, ఇతరులు ఆరు సీట్లు గెలుచుకుంటారు.

విజయవాణి సర్వే ప్రకారం..

కాంగ్రెస్ - 78
భారతీయ జనతా పార్టీ - 105
జేడీఎస్ -33
ఇతరులు - 6

Karnataka exit poll results 2018: Vijayavani exit poll results

మెజార్టీకి కావాల్సిన స్థానాలు 113. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ సర్వే ప్రకారం స్వతంత్రులు లేదా జేడీఎస్ మద్దతుతో బీజేపీ అధికారం చేజిక్కించుకోవచ్చు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కర్నాటకలో హంగ్ వస్తుందని ఎక్కువ వరకు ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో కర్నాటక ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? హంగ్ వస్తుందా? లేక ఏ పార్టీకైనా ప్రజలు ఏకపక్ష తీర్పును ఇస్తారా? అనేది ఆసక్తిని రేపుతోంది. ఫలితాల కోసం మే 15వ వరకు వేచి చూడాలి. ఓటింగ్ అనంతరం వచ్చే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలను బట్టి అంచనా వేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+