డీకేకు తప్పిన ముప్పు: హెలికాప్టర్‌ను ఢీ కొట్టిన గద్ద: ఎమర్జెన్సీ..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో పోలింగ్‌ను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. 13వ తేదీన ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసింది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేలిపోయేది ఆ రోజే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార తీవ్రతను పెంచాయి..
అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సీనియర్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పలు జిల్లాల్లో పర్యటించారు. కేంద్రమంత్రులు ఇక్కడే మకాం వేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్ని జిల్లాల్లో పర్యటించారు. బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య.. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సారథ్యాన్ని వహిస్తోన్నారు. ఇందులో భాగంగా డీకే శివకుమార్ ఇవ్వాళ కోలార్ జిల్లాలోని ముళబాగిలు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనడానికి బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.
మార్గమధ్యలో బెంగళూరు శివార్లలోని హోస్కొటే గగనతలంపై ప్రయాణిస్తోన్న సమయంలో ఆయన హెలికాప్టర్‌ను గద్ద ఢీ కొట్టింది. హెలికాప్టర్ విండ్ షీల్డ పెద్దశబ్దం చేస్తూ పగిలిపోయింది. పగిలిన అద్దం ముక్కలు గుచ్చుకుని డీకే శివకుమార్‌తో పాటు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తోన్న కెమెరామెన్‌కు గాయాలయ్యాయి. అద్దం పగిలిన వెంటనే పైలెట్ అప్రమత్తం అయ్యారు. హెలికాప్టర్‌ను హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్‌కు చెందిన ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు.
అంతకుముందు- ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యతో కలిసి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో పలు కీలక హామీలను పొందుపరచింది. ఈ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే డీకే శివకుమార్ ముళబాగిలు నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications