కర్ణాటక రిజల్ట్స్: తలకిందులైన ఎగ్జిట్ పోల్స్, కన్నడ ఓటర్ల విలక్షణ తీర్పు
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం నాటి ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ ఫలితాలకు మధ్య చాలా వ్యత్యాసం కన్పిస్తోంది. ప్రస్తుతమున్న ట్రెండ్స్ చూస్తే బిజెపికి స్పష్టమైన ఆధిక్యం వచ్చేలా కన్పిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తేల్చి చెప్పాయి. కానీ, ఫలితాలు మాత్రం బిజెపికి అనుకూలంగా ఉన్నాయి. హంగ్ అసెంబ్లీకి ఛాన్స్ కూడ లేదనే ఫలితాలు కన్పిస్తున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో మే 12వ తేదిన ఎన్నికలు జరిగాయి.పోలింగ్ రోజున సాయంత్రం పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కన్పించాయి. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ అవతరించనుందని తెలిపాయి. కానీ, మంగళవారం నాడు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపి ఆధిక్యంలో దూసుకుపోయింది.
తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఆధిక్యంలో దూసుకుపోయినట్టు కన్పించింది. కానీ, ఆ తర్వాత బిజెపి అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగారు. సుమారు వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లో బిజెపి అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు.

ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజారిటీ రాదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. హంగ్ అసెంబ్లీ తప్పదని కూడ ఆయా సంస్థలు తమ ఎగ్జిట్ సర్వే్ల్లో తేల్చాయి. అయితే దానికి భిన్నంగా ఫలితాలొచ్చాయి.
గతంలో కూడ తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె అధికారంలోకి వస్తోందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. కానీ, ఆ సమయంలో జయ నేతృత్వంలోని అన్నాడిఎంకె ప్రభుత్వం ఏర్పాటైంది.












Click it and Unblock the Notifications