మంతనాలు: రాయల తెలంగాణపై కెసిఆర్ గుర్రు
హైదరాబాద్: కాంగ్రెసు అధిష్టానం ముందుకు తెచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై పార్టీ నాయకులతో ఆదివారం ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచరాం.
హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే అంగీకరించాలని ఆయన పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల మద్దతును కూడగట్టాలని అనుకుటున్నట్లు తెలుస్తోంది.

కొందరు కాంగ్రెసు నాయకులు రాయల తెలంగాణను ముందుకు తోస్తున్నారని, దానికి అంగీకరించేది లేదని తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. పార్లమెంటు సభ్యులు జి. వివేక్, మందా జగ్నాథంలతో కలిసి కెసిఆర్ మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. తమ పార్టీ నాయకులు బిజెపి నేతలు రాజ్‌నాథ్ సింగ్‌ను, సుష్మా స్వరాజ్‌ను కూడా కలుస్తారని వినోద్ కుమార్ చెప్పారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనను బిజెపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము పది జిల్లాలతో కూడిన తెలంగాణనే అంగీకరిస్తామని, రాయల తెలంగాణకు తాము వ్యతిరేకమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. ఇదే మాటను బిజెపి నాయకుడు చెన్నమనేని విద్యాసాగర రావు సోమవారం మీడియాతో చెప్పారు మజ్లీస్‌తో కలిసి కాంగ్రెసు రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications