వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కడికంటే అక్కడకొస్తా, ఇష్టమున్నట్లు కొట్టండి: కేజ్రీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kejriwal on auto driver attack
న్యూఢిల్లీ: తన పైన వరుసగా జరుగుతున్న దాడుల పైన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం స్పందించారు. తాను ఎక్కడకు రమ్మంటే అక్కడకు.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని, మీ ఇష్టం వచ్చినట్లు కొట్టుకోండి అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

తన లక్ష్యం సమస్య పరిష్కారం కావడమే అన్నారు. సమస్య పరిష్కారం అయితే తాను సంతోషిస్తానని చెప్పారు. తన పైన దాడి వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. నాపై దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కేజ్రీవాల్ పైన దాడి వెనుక బిజెపి ఉందని, దీనిపై విచారణ జరిపించాలని అశుతోష్ డిమాండ్ చేశారు.

కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన మంగళవారం మరోసారి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈసారి కేజ్రీవాల్ పైన ఓ ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. న్యూఢిల్లీలోని సుల్తాన్ పురి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ పైన అతను దాడికి పాల్పడ్డాడు.

మంగళవారం కేజ్రీవాల్ రోడ్డు షో నిర్వహించారు. కేజ్రీవాల్ పార్టీ అభ్యర్థి రాఖీ బిర్లా తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కేజ్రీవాల్ చెంప పైన కొట్టాడు. అతనిని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చితకబాదారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/GBzS23bc_ns?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

కాగా, కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు అతనికి భద్రతను ఇస్తున్నారు. కేజ్రీవాల్ నిత్యం భద్రతాధికారుల సూచనలను పట్టించుకోవడం లేదట. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని దక్షిణపురిలో రోడ్డుషో సందర్భంగా కేజ్రీవాల్ పైన ఓ వ్యక్తి పిడిగుద్దు కురిపించిన విషయం తెలిసిందే.

కేజ్రీవాల్ పైన దాడికి ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షాలను బాధ్యులను చేస్తోంది. ప్రధానంగా బిజెపి పైన ఎఎపి నెపం నెడుతోంది. కాగా, వరుసగా తన పైనే దాడి జరుగుతుండటంపై, ఇంక్ వేస్తుండటంపై కేజ్రీవాల్‌తో పాటు ఎఎపి ఆశ్చర్యపోతోందట!

English summary
Delhi former CM and AAP convener Arvind Kejriwal responded after Auto Driver's attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X