లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను 9 గంటలపాటు విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అత్యంత నిజాయితీ గల పార్టీ అని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ఆదివారం విచారించింది. దాదాపు తొమ్మిది గంటలపాటు సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి కేజ్రీవాల్ బయటకు వచ్చారు. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలని శుక్రవారం సీబీఐ సమన్లు జారీ చేయగా.. ఆయన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
లిక్కర్ పాలసీ స్కాం కేసులో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాయలం నుంచి కేజ్రీవాల్ బయటకు వచ్చి తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలకు కారులోంచి అభివాదం చేశారు కేజ్రీవాల్.

అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ తనను తొమ్మిదిన్నర గంటలపాటు విచారించిందని తెలిపారు. ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పాను. మద్యం కుంభకోణం కేసు మొత్తం తప్పుడు, నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. తమ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కట్టర్ ఇమాందార్ పార్టీ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని.. కానీ, దేశప్రజలు తమవైపే ఉన్నారని అరవింద్ కేజ్రీవాలు చెప్పుకొచ్చారు.
#WATCH | CBI questioning conducted for 9.5 hours. Entire alleged liquor scam is fake, AAP is 'kattar imaandaar party'. They want to finish AAP but the country's people are with us...: Delhi CM Arvind Kejriwal speaks after nine hours of CBI questioning in excise policy case pic.twitter.com/ODnCGKv7R3
— ANI (@ANI) April 16, 2023
సీబీఐ అధికారులకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పానుకుంటున్నాను. వారు స్నేహపూర్వకంగా, సామరస్య పూర్వకంగా ప్రశ్నలు అడిగారు అని కేజ్రీవాల్ తెలిపారు. సీబీఐ అధికారులు తనను 56 ప్రశ్నలు అడిగారని చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం కేజ్రీవాల్ తన పార్టీ నేతలు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కొంతమంది మంత్రివర్గ సహచరులతో కలిసి సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్దకు కూడా వెళ్లారు. కేజ్రీవాల్ కు విచారణకు పిలువడంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు అంతకుముందు భారీ నిరసనలు చేపట్టాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications