ఓ మహిళతో సిఎం, వీడియో ఉంది: నిందితుడు
కొచ్చి: సోలార్ కుంభకోణం కేరళలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతో పాటు ఆరుగురు ప్రముఖ నేతలు ఓ మహిళతో కలిసి ఉండగా కెమెరాకు చిక్కారని కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ ఆరోపించాడు.
సరితా నాయర్ నే ఆ మహిళతో వారు విడివిడిగా ఉన్నప్పటికీ వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయని అతను చెప్పాడు. అయితే సరితా నాయర్ రాధాకృష్ణన్ ఆరోపణలను ఖండించారు. దమ్ముంటే వీడియోలు చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆ నాయకులకు తెలియకుండా సరితా నాయర్ ఆ వీడియోలు తీసిందని రాధాకృష్ణన్ చెప్పాడు. బ్లాక్ మెయిల్ తీయడానికి తీసిందో, ఆత్మరక్షణ కోసం తీసిందో తనతకు తెలియదని అతను సోలార్ కుంభకోణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ వద్ద చెప్పాడు. ఆమె అరెస్టు కావడానికి రెండు వారాల ముందు ఆ వీడియోలు తనకు ఇచ్చిందని, వాటిలో ఐదింటిని తాను సిఎం చాందీకి చూపించానని ఆయన చెప్పాడు.
ఆరో వీడియోలో మాత్రం ఊమెన్ చాందీ ఉన్నారని, దాంతో ఆ వీడియోను తాను ఆయనకు చూపించలేదని రాధాకృష్ణన్ చెప్పాడు. చాందీ లంచం తీసుకున్నారని రాధాకృష్ణన్ గతంలో ఆరోపించాడు. తాను స్వయంగా రూ.5.5 కోట్లు ఇచ్చానని, రాష్ట్రంలో రెండు పెద్ద సోలార్ ప్రాజెక్టులు పెట్టాడనికి ఈ మొత్తం ఇచ్చానని చెప్పాడు.












Click it and Unblock the Notifications