బీజేపీకి క్షమాపణలు చెప్పాలి, కేజ్రీవాల్‌కు ఫుల్ మార్క్స్: కిరణ్ బేడీ

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేతలకు తాను క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నేత కిరణ్ బేడీ మంగళవారం అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడారు. కృష్ణానగర్ నియోజకవర్గం నుండి ఆమె ఓడిపోయారు.

ఆ నియోజకవర్గ ప్రజలు తనను వ్యతిరేకించినప్పటికీ.. వారికి తాను కృతజ్ఢతలు చెబుతున్నానని చెప్పారు. తన పైన నమ్మకం ఉంచి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన బీజేపీకి తాను క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలను ఏఏపీ అధినేత కేజ్రీవాల్ నెరవేరుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఓడలేదని, బీజేపీ ఓడిందని కిరణ్ బేడీ అన్నారు.

దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచ నగరంగా మారుతుందని ఆశిస్తున్నానని కిరణ్‌ బేడీ అన్నారు. ఢిల్లీలో ధనికులు, పేదల మధ్య పూడ్చలేనంత అగాధం పెరిగిపోయిందన్నారు. ధనికులు, పేదల మధ్య అంతరం తగ్గాలని ఆమె ఆకాంక్షించారు. 16 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో పరిస్థితి దిగజారిందని విమర్శించారు.

Kiran Bedi on Twitter:

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో తనకు గొప్ప ఆదరణ లభించిందని, తనను ఆదరించినవారందరికీ కిరణ్‌ బేడీ ధన్యవాదాలు తెలిపారు. ఓటేశారా లేదా అన్నది ముఖ్యం కాదన్న ఆమె ప్రచారంలో తన వెంట నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఓడిపోయిన అభిర్థినని,. గెలిచినవారిపై బాధ్యత ఉంటుందన్నారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్‌కు పూర్తి మార్కులు వచ్చాయని కిరణ్‌ బేడీ అభినందించారు. ధర్నా రాజకీయాలతో పాలన నడవదని, పాలన రాజకీయాలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ గుర్తించుకోవాలని కిరణ్‌ బేడీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+