ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎన్నికల గుర్తు ఇదే..!!
మరికొన్ని నెలల్లో బీహార్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని ప్రధాని పార్టీలు ఇప్పటికే తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. లెక్కలు, పొత్తులు చర్చలతో ముందుకెళుతున్నాయి. ఈ సారి బీహార్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. బీజేపీ జేడీయూలు కలిసి వెళుతుండగా ఆర్జేడీ కాంగ్రెస్‌లు కలిసి పోటీచేస్తున్నాయి. ఇక ఒకప్పుడు పలు పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో సొంత పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీ పేరు జన్ సురాజ్. అయితే ఇప్పటి వరకు తన పార్టీకి ఎన్నికల గుర్తు లేదు. తాజాగా ఎన్నికల సంఘం జన్ సురాజ్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించినట్లు సమాచారం.
కిషోర్ పార్టీకి 'స్కూల్‌బ్యాగ్' గుర్తు
రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీని స్థాపించి బీహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన 2024 అక్టోబర్ 2న బీహార్ రాజధాని చంపారన్ నుండి 'పాదయాత్ర' ప్రారంభించారు. బీహార్ వెనుకబాటుతనాన్ని రూపుమాపి, అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఆయన ఈ యాత్ర చేపట్టారు.

త్వరలోనే జన సురాజ్ పార్టీని ఆయన అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ గుర్తును ఖరారు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు ఏకాభిప్రాయంతో 'స్కూల్‌బ్యాగ్' గుర్తును ఎన్నుకున్నారని సమాచారం.
ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. "చాలామంది అభిప్రాయం ప్రకారం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే గుర్తును ఎన్నుకోవడం జరిగింది" అని అన్నారు. విద్య మరియు అభివృద్ధికి విలువనిచ్చే ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి "స్కూల్ బ్యాగ్" గుర్తును కేటాయించడం ఒక వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు.
'స్కూల్‌బ్యాగ్' గుర్తు వెనుక ఆంతర్యం
'స్కూల్‌బ్యాగ్' గుర్తు బీహార్ అభివృద్ధికి, విద్యకు ప్రాధాన్యతనిస్తుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తమ పార్టీ ఆశయాలు, విలువలు బీహార్ ప్రజలకు చేరువయ్యేలా ఈ గుర్తు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.జన సురాజ్ పార్టీ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని, ఈ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తోందని కిషోర్ పేర్కొన్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో జన సురాజ్ పార్టీ పోటీ చేస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
బీహార్ ప్రజల మార్పును కోరుకుంటున్నారని, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ప్రజలు తమ పార్టీని విజయపథం వైపు తీసుకెళుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జన సురాజ్ పార్టీ ఎన్నికల బరిలో నిలవడం ద్వారా బీహార్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications