Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోహినూర్ డైమండ్ పై తేలిన నిజం.. ప్రభుత్వం ఆ పని చేయాలన్న శశిథరూర్

కోహినూర్ వజ్రం మనదే.. ఈ మాట చెప్పుకోవడానికే తప్ప, మనది అని చూపించుకోవడానికి అది ప్రస్తుతం మన అధీనంలో లేదు. కోహినూర్ వజ్రం గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారతీయులు ఒకింత గ్రేట్ గా ఫీల్ అవుతారు. ఎప్పటికైనా బ్రిటన్ నుంచి అత్యంత విలువైన కోహినూర్ డైమండ్ ఇండియాకు తీసుకువస్తే బాగుంటుందని ప్రతి భారతీయుడు కోరుకుంటారు. కోహినూర్ వజ్రంతోపాటు భారతదేశం నుంచి ఎంతో విలువైన సంపదను బ్రిటీషర్లు తమ దేశానికి దోచుకు వెళ్లారు. అలా కోహినూర్ వజ్రం మన దేశం నుంచి మాయమై బ్రిటన్ కు చేరింది.

అయితే తాజాగా బ్రిటన్ రాజప్రసాదంలో ఉన్న అమూల్యమైన కోహినూర్ వజ్రం తో పాటు విలువైన ఆభరణాలు వజ్రాలు ఎక్కడ నుండి వచ్చాయి అన్నదానిపై ది గార్డియన్ పత్రిక బ్రిటన్ రాజసంపదపై పరిశోధనలు చేసింది. "కాస్ట్ ఆఫ్ ది క్రౌన్" పేరుతో ముద్రించిన పరిశోధనాత్మక కథనాలలో బ్రిటన్ రాజసంపద భారతదేశం నుంచి తీసుకువచ్చింది అని తేల్చింది. 1912 నుండి జరిగిన అనేక పరిణామాలను 42 పేజీలతో ది గార్డియన్ పత్రిక వివరించింది.

Kohinoor diamond is from India.. congress leader Shashi Tharoor targets center with tweet

ప్రస్తుతం కోహినూర్ వజ్రం బ్రిటన్ మహారాణి అధికారిక నివాసమైన టవర్ ఆఫ్ లండన్ లో ఉంది. బ్రిటన్ పాలించిన దేశాల నుంచి తెచ్చిన ఎన్నో విలువైన వజ్రాలు, బంగారు వస్తువులు, ఇతర విలువైన సంపదను ఆ దేశాలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ముఖ్యంగా గత సంవత్సరం బ్రిటన్ రాణి మరణం తర్వాత ఈ డిమాండ్లు బాగా ఊపందుకున్నాయి.

అయితే తాజాగా గార్డియన్ పత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక కథనాలతో కాంగ్రెస్ పార్టీ నుండి కొత్త డిమాండ్ వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బ్రిటిష్ పాలనా కాలంలో గొప్ప నాగరికత మిషన్ యొక్క యాదృచ్ఛిక దోపిడీ అప్పుడు సాగిందని కొందరు చెబుతున్నా, వలస రాజ్యాల నిజమైన దోపిడీ ఏమిటో గార్డియన్ పత్రిక అందరికీ అర్థమయ్యేలా చెప్పిందని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

అంతేకాదు దొంగిలించబడిన ఆస్తిని తిరిగి తీసుకురావడం కోసం చర్చలు జరపడానికి ఇది సరైన సమయం అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి కోహినూర్ వజ్రం భారతదేశానిదే అని ది గార్డియన్ పత్రిక పక్కా ఆధారాలతో ప్రచురించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని, భారతదేశం నుండి కొల్లగొట్టుకుపోయిన సంపదను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+