అందమైన విధవలను టార్గెట్ చేసిన వెధవన్నర వెధవ, ఖరీదైన కారులో వెళ్లి ఏం చేశాడంటే ? పెళ్లి!

మైసూరు/బెంగళూరు: భర్తలు చనిపోయి ఒంటరిగా జీవిస్తున్న అందమైన విధవలను టార్గెట్ చేసుకుని మోసం చేస్తున్న తమిళనాడు తంబీని కర్ణాటకలోని మైసూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు నుంచి ఖరీదైన కారులో బెంగళూరు, మైసూరు నగరాలకు వచ్చి విధవలకు పంగనామం పెడుతున్న ఘరానా మోసగాడి అపలు వ్యవహారం బయటపడింది. సోషల్ మీడియాలో ప్రకటనలు చూడటం, అందమైన విధవలను సంప్రధించి వారికి వల వెయ్యడం ఆనవాయితీగా పెట్టుకుని మోసం చేస్తూ అడ్డంగా బుక్కైనాడు.

పెళ్లి ప్రకటనలు

పెళ్లి ప్రకటనలు

తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై)కు చెందిన వినిత్ రాజ్ (47) పెళ్లి ప్రకటనలు, అనేక వెబ్ సైట్ లో పెళ్లి చేసుకోవడానికి ఎదురు చూస్తున్న విధవల వివరాలు తెలుసుకున్నాడు. తరువాత వినిత్ రాజ్ సైతం సోషల్ మీడియాలో అతని నకిలీ ఫ్రొఫైల్ క్రియేట్ చేసి వాటి వివరాలు పెట్టాడు.

నా భార్య పోయింది

నా భార్య పోయింది

తాను కోయంబత్తూరులో ఆటోమొబైల్ వ్యాపారం చేస్తున్నానని, డబ్బులు బాగా సంపాధిస్తున్నానని వినిత్ రాజ్ పలువురిని నమ్మించాడు. తన భార్య ఐదు సంవత్సరాల క్రితం మరణించిందని, తాను వేరే పెళ్లి చేసుకోవడానికి అందమైన విధవ కోసం ఎదురు చూస్తున్నానని సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చాడు.

మైసూరులో అందమైన మహిళ

మైసూరులో అందమైన మహిళ

గత నెలలో మైసూరు నగరంలో నివాసం ఉంటున్న అందమైన విధవను సోషల్ మీడియాలో వినిత్ రాజ్ సంప్రధించాడు. తాను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మనం ఇద్దరం మైసూరు నగరంలోని ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం చాముండి బెట్ట( చాముండి కొండ) మీద కలుసుకుందామని వినిత్ రాజ్ ఆమెకు మాయమాటలు చెప్పాడు.

దుష్టశక్తులకు దూరంగా ఉందాం !

దుష్టశక్తులకు దూరంగా ఉందాం !

చాముండి కొండ మీద విలాసవంతమైన కారులో వచ్చిన వినిత్ రాజ్ విధవను కలుసుకున్నాడు. మనం పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలాని, దుష్టశక్తుల మన దగ్గరకు రాకుండా ఉండాలంటే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చెయ్యాలని పరస్సరం బంగారు గొలుసు మార్చుకోవాలని అర్చకులు చెప్పారని విధవను నమ్మించాడు. తరువాత ఇద్దరి మెడలో ఉన్న బంగారు గొలుసులు ఒకరికొకరు మార్చుకున్నారు. అయితే వినిత్ రాజ్ నకిలీ బంగారం గొలుసు ఆమె మెడలో వేశాడు. అక్కడే ఆలయంలో ఇద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. చాముండి కొండ దిగిన తరువాత ఎవరి గొలుసు వారు మార్చుకుందామని విధవను వినిత్ రాజ్ నమ్మించాడు.

హోటల్ లో బాత్ రూంలోకి వెళితే !

హోటల్ లో బాత్ రూంలోకి వెళితే !

మైసూరు నగరంలోని ఓ హోటల్ లో విధవతో కలిసి వినిత్ రాజ్ కాఫీ తాగడానికి వెళ్లాడు. తరువాత ఆమె బాత్ రూంలోకి వెళ్లారు. అదే సమయం కోసం వేచి చూస్తున్న వినిత్ రాజ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. కొన్ని గంటల పాటు హోటల్ దగ్గర వేసి చూసిన ఆ మహిళ వినిత్ రాజ్ కు ఫోన్ చేసింది. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె ఇంటికి వెళ్లిపోయింది.

కిలాడీ కేటుగాడు

కిలాడీ కేటుగాడు

ఇంటికి వెళ్లిన మహిళ వినిత్ రాజ్ ఇచ్చింది నకిలీ బంగారు గొలుసు అని గుర్తించి మైసూరు నగరంలోని కృష్ణరాజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాముండి కొండ మీద, హోటల్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. నిందితుడు వినిత్ రాజ్ TN 66 R 2921 కారులో వచ్చాడని గుర్తించారు. కోయంబత్తూరు చేరుకున్న మైసూరు పోలీసులు విధవలను తెలివిగా మోసం చేస్తున్న వినిత్ రాజ్ ను అరెస్టు చేశారు. వినీత్ రాజ్ బెంగళూరు నగరంలోని ఇందిరానగర్ లో, మైసూరు నగరంలో అనేక మంది విధవలను ఇలాగే మోసం చేశాడని, నిందితుడి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+