బిజెపి అద్భుత గెలుపు: 30 ఏళ్ల తర్వాత తొలిసారి మేయర్ పదవి
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో తొలిసారి భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన కుసుమ్ సద్రెట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాల తర్వాత సిమ్లాలో బిజెపికి అద్భుత విజయం దక్కింది.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో తొలిసారి భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన కుసుమ్ సద్రెట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాల తర్వాత సిమ్లాలో బిజెపికి అద్భుత విజయం దక్కింది.
మంగళవారం సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కుసుమ్ సద్రెట్, డిప్యూటీ మేయర్‌గా రాకేష్ శర్మ ఎన్నికయ్యారు. జూన్ 17న ఇక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 34 సీట్లకు గాను 17 సీట్లను బిజెపి గెలిచింది. మెజారిటీకి ఒక్క సీటు దూరంలో నిలిచింది.

బిజెపి రెబల్‌గా బరిలోకి దిగి విజయం సాధించిన శర్మ తిరిగి పార్టీ గూటికి చేరడంతో బిజెపి ఆధిక్యం సంపాదించింది. ఫలితంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆ పార్టీ సొంతమయ్యాయి.
ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనప్పటికీ కాంగ్రెస్, బిజెపిలు మాత్రం తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. కాగా, సిమ్లాలో 2012 వరకు కాంగ్రెస్ ఏకధాటిగా 26 ఏళ్లపాటు అధికారాన్ని చెలాయించింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications