ఆరోస్సారి.. పాన్ - ఆధార్ లింకింగ్ గడువు పెంపు.. ఎప్పటివరకో తెలుసా?
ఢిల్లీ : పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్ లింకింగ్ గడువు మరోసారి పెరిగింది. ఇప్పటివరకు ఐదుసార్లు గడువు పెంచింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా పెంచిన గడువుతో ఇది ఆరోసారి. లింకింగ్ కు 2019, మార్చి 31వ తేదీ తుది గడువు అంటూ వారం రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చివరి తేదీ అయిన ఆదివారం సాయంత్రం నాడు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ మరో 6 నెలలు గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది.
మార్చి 31వ తేదీన ముగిసిన లింకింగ్ గడువును 2019, సెప్టెంబర్ 30 వరకు పెంచింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT). ఆ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఆదాయపు పన్ను శాఖ పాన్ - ఆధార్ లింకింగ్ తప్పనిసరి అంటూ పేర్కొంది. అంతేకాదు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోవాల్సిందే అంటూ తెలిపింది.

2018, సెప్టెంబర్ నాటికి నలభై ఒక్క కోట్ల పాన్ కార్డులు జారీ అయ్యాయి. వాటిలో ఇరవై ఒక్క కోట్ల పాన్ కార్డులు, ఆధార్ కార్డులతో లింకింగ్ పూర్తయ్యాయి. ఐటీ రిటర్న్స్ దాఖలుకు.. పాన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించడం తప్పనిసరంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలిచ్చింది. 2017, జులై 31వ తేదీ లింకింగ్ కు చివరితేదీ అంటూ అలా అలా పొడిగిస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత పొడిగింపుతో అది ఆరోసారికి చేరినట్లైంది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications