Bank loan: భార్య, ఇద్దరు కూతుర్లు, బ్యాంక్ నోటీసులు చూసి బావిలో దూకిన అన్నదాత !
బెంగళూరు: కలబురిగి: వ్యవసాయం చేయిస్తున్న రైతు కొన్ని సంవత్సరాలు డబ్బులు బాగానే సంపాధించాడు. ఇటీవల పంటలు పెట్టడానికి బ్యాంక్ లో రుణం తీసుకున్నాడు. రుణం తీసుకున్న డబ్బుతో పంట పెట్టాడు. పంట చేతికి వస్తుందని అనుకుంటున్న సమయంలో పరిస్థితులు అనుకూలించక పంట మొత్తం నాశనం అయ్యింది. బయట, బ్యాంకులో తీసుకున్న అప్పు సరైన సమయంలో చెల్లించలేక ఆ రైతు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో హడలిపోయిన రైతు బావిలో దూకేయడం కలకలం రేపింది.

భార్య, ముగ్గురు పిల్లలు
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని అఫ్జల్ పూర్ తాలుకాలోని గౌర అళ్లగి గ్రామంలో జగదీష్ హోసమని అలియాస్ జగదీష్ )38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకున్న జగదీష్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి జగదీష్ అతని సొంత పొలంలో వ్యవసాయం చేయిస్తున్నాడు.

బ్యాంక్ లో రూ. 2 లక్షలు అప్పు
వ్యవసాయం చేయిస్తున్న జగదీష్ కొన్ని సంవత్సరాలు డబ్బులు బాగానే సంపాధించాడు. ఇటీవల పంటలు పెట్టడానికి ఓ బ్యాంక్ లో జగదీష్ రూ. 2 లక్షలు రుణం తీసుకున్నాడు. రుణం తీసుకున్న రూ. 2 లక్షల డబ్బుతో సొంత పొలంలో పంట పెట్టాడు. పంట చేతికి వస్తుందని అనుకుంటున్న సమయంలో పరిస్థితులు అనుకూలించక జగదీష్ పెట్టిన పంట మొత్తం నాశనం అయ్యింది.

బ్యాంక్ అధికారుల దెబ్బతో రైతు ఆత్మహత్య
బ్యాంకులో రూ. 2 లక్షలతో పాటు తెలిసినవాళ్ల దగ్గర జగదీష్ అప్పు చేశాడు. ఇంతకాలం తెలిసిన వాళ్లకు సర్దిచెబుతూ వచ్చిన జగదీష్ ను బ్యాంక్ అధికారులు వెంటాడారు. తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో హడలిపోయిన ఆవేదన చెందిన అన్నదాత జగదీష్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications