Lockdown: కాంగ్రెస్ లీడర్ కొడుకు పెళ్లి, ఢాం ఢూమ్, మాస్క్ లేదు, చింతకాయి లేదు, కరోనా భయం లేదు !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొత్తం లాక్ డౌన్ అమలులో ఉందని, లాక్ డౌన్ విషయంలో రాజీపడమని, కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశామని అధికారులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే తన కుమారుడి వివాహం లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి ఢాం ఢూమ్ అంటూ నిర్వహించారని, కనీసం మాస్కులు వేసుకోకుండా, సమదూరం పాటించకుండా గుంపులు గుంపులుగా పెళ్లి జరిపించారని వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదేం పోయేకాలం అంటూ స్థానిక ప్రజలు శాపనార్తాలు పెడుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే అంటే మాటలా, మజాకానా !
కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బి.జి. గోవిందప్ప మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. మాజీ ఎమ్మెల్యే గోవిందప్ప కుమారుడి వివాహం బెలగూరులో నిర్వహించాలని కొన్ని రోజుల క్రితమే నిర్ణయించారు. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చేసినా ఆ నియమాలు ఏమాత్రం పట్టించుకోకుండా మాజీ ఎమ్మెల్యే బిజి. గోవిందప్ప ఆయన కుమారుడి వివాహం జరిపించేశారు.

మాస్క్ లేదు, చింతకాయి లేదు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిజి. గోవిందప్ప కుమారుడి వివాహం ఎలాంటి మాస్కులు వేసుకోకుండా జరిపించారని వెలుగు చూసింది. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో పాటు మాజీ ఎమ్మెల్యే, వారి బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ మాస్క్ లు వేసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో అందులో ఒక్కరు కూడా మాస్క్ వేసుకోలేదనే విషయం స్పష్టంగా కనపడుతోంది.

లీడర్స్ కు రూల్స్ లేవా ?
మాజీ ఎమ్మెల్యే బిజి. గోవిందప్ప కుమారుడు పెళ్లికి మాజీ ఎంపీ బీఎన్. చంద్రప్ప, చెళ్ళకెరె ప్రస్తుత శాసన సభ్యుడు రఘమూర్తి తదితరులు హాజరైనారు. మాజీ ఎంపీ బీఎన్. చంద్రప్ప, చెళ్ళకెరె ఎమ్మెల్యే రఘమూర్తి మాస్క్ లు పెట్టుకున్నారని సమాచారం. అయితే మిగిలిన వారు ఎవ్వరూ మాస్క్ లు పెట్టుకోకపోవడంతో రాజకీయ నాయకులు, లీడర్స్ కు ఒక రూల్ మాకు ఒక రూల్ పెట్టారా అంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్షం ?
మాజీ ఎమ్మెల్యే బిజి. గోవిందప్ప కుమారుడి పెళ్లిలో ఎవ్వరూ మాస్క్ లు పెట్టుకోలేదని, కనీసం సమదూరం పాటించలేదని, పెద్దలు, పిల్లలు అందరూ గుంపులు గుంపులుగా ఉన్నారని, ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదని, ఎక్కడ మాకు కరోనా వైరస్ వస్తుందో అని భయంగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బిజి. చంద్రప్ప కుమారుడి పెళ్లి విషయం గురించి హోసదుర్గ తహసిల్దార్ ను మీడియా ప్రశ్నించగా తమకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని, పెళ్లి జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు తెలుసుకుంటామని సింపుల్ గా చెప్పేశారు.

నిన్న మాజీ సీఎం, నేడు మాజీ ఎమ్మెల్యే
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బిజి. గోవిందప్ప కుమారుడి వివాహం వివాదానికి దారితీసింది. ఇటీవల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ వివాహం సైతం లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో రామనగరలోని ఆయన సొంత ఫామ్ హౌస్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పడు కర్ణాటకలో మాజీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వివాదానికి దారితీసింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications