600ఏళ్లకొకసారి వచ్చే సుదీర్ఘ చంద్ర గ్రహణం: ఏయే దేశాల్లో పూర్తిగా కనిపించిందంటే?
న్యూడిల్లీ: శుక్రవారం(నవంబర్ 19న) సుదీర్ఘ చంద్ర గ్రహణం సంభవించింది.
ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది. 580 ఏళ్ల తర్వాత ఈ సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడటం గమనార్హం. చంద్ర గ్రహణం వ్యవధి దాదాపు మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు కొనసాగింది.
చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న ఇంత సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. తాజాగా, ఈ చంద్రగ్రహణం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించింది. చంద్రునికి సూర్యునికి మధ్యగా సరళరేఖ మార్గంలో భూమి వచ్చిన సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. ఈ క్రమంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఇక ఈ ఏడాది చంద్ర గ్రహణాల్లో ఇది చివరిది. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పడిన ఈ గ్రహణం.. సాయంత్రం వరకు ఉంది. ఇలాంటి సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం గతంలో 1440ల్లో ఏర్పడింది. మళ్లీ 2489 అక్టోబర్ 9న ఏర్పడనుంది. అయితే, నవంబర్ 8, 2022లో మరో సుదీర్ఘ చంద్రగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Recommended Video
కాగా, ఈ చంద్ర గ్రహణం పూర్తిగా ఉత్తరఅమెరికా, దక్షిణ అమెరికా, పాలినేసియా, ఆస్టర్న్ ఆస్ట్రేలియా, నార్త్ ఈస్టర్న్ ఆసియా ప్రాంతాల ప్రజలకు బాగా కనిపించింది.












Click it and Unblock the Notifications