ముంబైలో ఉగ్రకలకలం: ఉగ్రవాది స్కెచ్ విడుదల
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో అనుమానాస్పద వ్యక్తులు ఆయుధాలతో సంచరిస్తున్నారన్న నేపథ్యంలో నేవీ ముంబై అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు అనుమానిత ఉగ్రవాది స్కెచ్‌ను విడుదల చేశారు.
ముంబైకి యాభై కిలోమీటర్ల దూరంలో యురాన్‌లోని నేవీ ఆయుధాగారం దగ్గర ఐదారుగురు వ్యక్తులను తాము చూసినట్లు అక్కడి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో నేవీ అత్యంత అప్రమత్తత ప్రకటించింది.

వారి కోసం ముంబై మొత్తం విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ను కూడా రంగంలోకి దింపారు. ఏటీఎస్, నేవీ, పోలీసు అధికారులతో కలిసి ఎన్ఎస్‌జీ అనుమానిత వ్యక్తుల కోసం గాలిస్తోంది.
పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, ప్రజలు భయాందోళన చెందాల్సిన పని లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు సంచరించిన యురాన్ ప్రాంతంలోనే పోర్టు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉండటంతో ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications